BigTV English

Paralympics 2024: ఒక్కరోజే ఐదు పతకాలు.. పారాలింపిక్స్‌లో భారత్ హవా!

Paralympics 2024: ఒక్కరోజే ఐదు పతకాలు.. పారాలింపిక్స్‌లో భారత్ హవా!

Paralympics 2024 India Number of medals: పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం ఒక్కరోజే ఐదు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పారు. ఈ పతకాల్లో ఒకటి గోల్డ్, రెండు సిల్వర్, రెండు బ్రాంజ్ ఉన్నాయి.


బ్యాడ్మింటన్ ప్లేయర్ నితేశ్ కుమార్ భారత్ కు మరో గోల్డ్ అందించారు. సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 3 లో నితేశ్ కుమార్ బంగారు పతకం గెలిచాడు. తొలిసారి పారా ఒలింపిక్స్ ఆడుతున్న నితేశ్.. ఫైనల్‌లో 21-14, 18-21,23-21 తేడాతో బ్రిటన్ కు చెందిన డానియల్ బెతెల్ ను ఓడించాడు.

కాగా, అంతకుముందు షూటర్ అవని లేఖరా గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, నితేశ్ కుమార్ బంగారు పతకం సాధించడంతో భారత్ కు రెండు గోల్డ్ మెడల్ వచ్చినట్లయింది.


అలాగే, పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 లో యోగేశ్ కుతునియా సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాడు మజుర్ చేతితో ఎస్ఎల్ యతి రాజ్ ఓటమి చెందడంతో సిల్వర్ మెడల్ వరించింది.

Also Read: పాకిస్తాన్ కు.. మరో అవమానం తప్పదా?

మహిళల సింగిల్స్ ఎస్‌యూ 5 ఫైనల్ మ్యాచ్ లో తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామ్ దాస్ కాంస్యం పతకాలు సాధించారు. దీంతో పారా ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన పతకాల సంఖ్య 12కు చేరింది.

 

 

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×