E-Paper
Advertisement

Tollywood Heroines: రెండు జడలు వేసుకొని హొయలు పోతున్న ఈ అక్కాచెలెళ్లు.. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు.. ఎవరో గుర్తుపట్టండి

Tollywood Heroines: రెండు జడలు వేసుకొని హొయలు పోతున్న ఈ అక్కాచెలెళ్లు.. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు.. ఎవరో గుర్తుపట్టండి
Advertisement

Tollywood Heroines: లంగా జాకెట్ వేసుకొని.. నీట్ గా రెండు జడలు వేసుకొని అందంగా కనిపిస్తున్న ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లను చూస్తుంటే ఎవరైనా గుర్తుకు వస్తున్నారా.. ? ఎక్కడో చూసినట్టుంది.. కానీ గుర్తుకు రావడం లేదు అంటారా.. ? అయితే ఈ ఇద్దరు ముద్దొచ్చే ముద్దుగుమ్మలు ఎవరో కాదు.. సీనియర్ నటి రాధ.. ఆమె అక్క అంబిక. వీరిద్దరూ అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపినవారే.

అంబికా.. 1997 లో మమంగం అనే మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈమె ఎక్కువ కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో అప్పుడప్పుడు కనిపించినా.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మా నాన్నకు పెళ్లి, అరుణాచలం, యముడికి మొగుడు, రాయుడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

Advertisement

ఎక్కడైనా అక్క ముందు వచ్చి.. ఆమె వెంట చెల్లి వస్తుంది. కానీ రాధా విషయంలో అది రివర్స్ ముందు చెల్లి వచ్చి.. ఆమె వెంట అక్క వచ్చింది. సీనియర్ నటి రాధ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రాధ అసలు పేరు ఉదయచంద్రిక. 80వ దశకములో ఈ చిన్నది మహారాణిగా వెలిగింది. ఆమె సరసన నటించని స్టార్ హీరో లేడు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. రజినీకాంత్, కలం హాసన్, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పిచింది.

Advertisement

దాదాపు 250 సినిమాలో రాధ కనిపించింది. ఇక 1991 లో రాజశేఖరన్ నాయర్ ను వివాహమాడి రాధా నాయర్ గా మారింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన రాధ.. ఇంటికే పరిమితమయ్యింది. రాధకు ఇద్దరు కుమార్తెలు. కార్తీక నాయర్, తులసి నాయర్. వీరిద్దరూ కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

నాగ చైతన్య తొలి చిత్రం జోష్ లో కార్తీక నటించగా.. కడలి అనే సినిమాతో తులసి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే తల్లి రాధలా విజయాలను అందుకోలేకపోయారు. దీంతో ఈ మధ్యనే కార్తీక వివాహం చేసుకోగా.. తులసి తమిళ్ సినిమాలతో బిజీగా మారింది. ఇక రాధా ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

పెళ్లికి ముందు నాజూకు తీగలా ఉండే రాధ.. ఇప్పుడు కాస్త బరువు పెరిగింది. అయినా ఆమె అందంలో, డ్యాన్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఇక ఈ అక్కాచెల్లెళ్లు ఎప్పుడు కనిపించినా సందడిగా ఉంటారు. వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×