E-Paper
Advertisement

Tollywood :క్రేజ్, క్యాష్ కోసమే తెలుగు సినిమాలు… ఈ హిందీ స్టార్లకు తెలుగు ప్రమోషన్ లలో పాల్గొనడం నమోషి

Tollywood :క్రేజ్, క్యాష్ కోసమే తెలుగు సినిమాలు… ఈ హిందీ స్టార్లకు తెలుగు ప్రమోషన్ లలో పాల్గొనడం నమోషి
Advertisement

Tollywood : పాన్ ఇండియా సినిమా అంటే టక్కున గుర్తు వచ్చేది టాలీవుడ్ మాత్రమే. ఇప్పుడు మిగతా భాషల సినిమాలు పాన్ ఇండియా పేరుతో రిలీజ్ అవుతున్నప్పటికీ, అందరికీ బాహుబలితో పాన్ ఇండియా బాట పరిచిన ఘనత మాత్రం జక్కన్నకే చెందుతుంది. కాబట్టి పాన్ ఇండియా అంటే టాలీవుడ్ అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ బాలీవుడ్ మాత్రం ఇంకా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నట్టుగా కనిపించట్లేదు. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న మన హీరోలతో నటించడం, ఇక్కడ కూడా క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం వంటి వాటికి సిద్ధంగా ఉంటున్న పలువురు స్టార్స్ తెలుగు ప్రేక్షకులకు మొహం చూపించడానికి మాత్రం పెద్దగా ఇష్టపడుతున్నట్టు లేదు. ఇక్కడికి వచ్చి తెలుగు ప్రేక్షకుల ముందు మనసారా మాట్లాడి, ప్రమోషన్స్ లో పాల్గొనడం మాత్రం వాళ్లకి నామోషీగా అనిపిస్తున్నట్టుగా ఉంది. తాజాగా దేవర రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ స్టార్స్ విషయంలో ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొనడం నామోషీనా?

Advertisement

దేవర మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, జాన్వి కపూర్ కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూవీ తెలుగు ప్రమోషన్లలో అంటే వీడియోలలో కాకుండా ప్రెస్ మీట్ వంటి వాటిలో ఈ స్టార్స్ ఇద్దరూ ఎక్కడా కనిపించలేదు. కానీ ఇదే పాన్ ఇండియా మూవీకి బాలీవుడ్ ప్రమోషన్స్ కు మాత్రం రెడీగా ఉంటున్నారు. అంటే వీళ్లకు తెలుగు ప్రేక్షకులు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ఇక్కడి ప్రేక్షకుల అభిమానం, నిర్మాతలు ఇచ్చే భారీ రెమ్యూనరేషన్ కావాలి.. కానీ అదే ప్రేక్షకుల ముందుకు రావడానికి మాత్రం ఇష్టపడరా? అని మండిపడుతున్నారు టాలీవుడ్ మూవీ లవర్స్. మన స్టార్ హీరోలు మాత్రం సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అయితే అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ కోసం రెడీగా ఉంటున్నారు. కానీ ఇతర భాషలో స్టార్స్ మాత్రం ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ తమ సినిమాలను తెలుగులో క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

Devara Trailer: क्या सैफ अली खान ढूंढ पाएंगे जूनियर NTR के लिए सही हथियार?

Advertisement

ఎఫెక్ట్ దేవరపై పడనుందా?

బ్రహ్మాస్త్ర మూవీ రిలీజ్ అయినప్పుడు రణబీర్ కపూర్, ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ లో అలియా భట్ యాక్టివ్ గా కనిపించారు. కానీ దేవర మూవీ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో జరుగుతుంది. ఎన్టీఆర్ అక్కడికి వెళ్లి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు గానీ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయారు. అయితే ఇలా స్టార్స్ తెలుగు ప్రమోషన్స్ కు దూరంగా ఉండడానికి మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇస్తున్న చనువే కారణమా? లేదంటే వాళ్లకు హిందీలో తప్ప ఇతర భాషలో ప్రమోషన్స్ చేయడం ఇష్టం లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా స్టార్స్ ని ఎంతగా ఓన్ చేసుకుంటారో, వాళ్లు ఇలా తక్కువ చేసి చూస్తే మాత్రం అంతే దూరంగా నెట్టి పారేస్తారు. ఇప్పుడు సైఫ్ అలీఖాన్, జాన్వి విషయంలో తెలుగు ప్రేక్షకులు ప్రమోషన్స్ లో పాల్గొనక పోయినా ఆదరణ చూపిస్తారా లేదా అనే విషయం తెలియాలంటే దేవర రిలీజ్ అయ్యేదాకా వెయిట్ అండ్ సి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×