BigTV English

Kiran Abbavaram Wedding: ఎస్ఆర్ కళ్యాణమండపంలో ఒక్కటైన రాజావారు రాణిగారు

Kiran Abbavaram Wedding: ఎస్ఆర్ కళ్యాణమండపంలో ఒక్కటైన రాజావారు రాణిగారు

Tollywood young hero Kiran Abbavaram, Rahasya Gorak married: ఎటువంటి సినీ పెద్దల అండదండలు లేకుండా ఓన్ ట్యాలెంట్ తో అప్ కమింగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. గత కొంతకాలంగా హిట్ సినిమాలేమీ లేని కిరణ్ అబ్బవరం ‘క’ అనే మూవీతో తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


అయితే సినిమాలకు రాకముందు కొన్ని షార్ట్ ఫిలింస్ , ఓటీటీలు చేసిన కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ మూవీ ఓటీటీలో విశేషాదరణ పొందింది. అయితే ఆ మూవీలో కిరణ్ తో కలిసి రాణిగారుగా నటించింది రహస్య గోరక్. ఆ మూవీ టైమ్ లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2019 నుంచి కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ తమ ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచారు. కాగా కొద్దిరోజుల క్రితం కిరణ్ అబ్బవరం తాను ప్రేమించిన రహస్య గోరక్ తో పెళ్లి జరగబోతోందని ప్రకటించారు. ఎట్టకేలకు ఆగస్టు 22న ఈ యువజంట ఒక్కటయ్యారు. కేవలం ఇంటి సభ్యులు, పరిమిత అతిధుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.

తెలుగు సంప్రదాయ రీతిలో


కర్ణాటక ప్రాంతంలోని కొడుగు లో పెళ్లి జరిగింది. ఇద్దరూ తెలుగు సంప్రదాయం ప్రకారం తలంబ్రాలు, జీలకర్ర, కన్యాదానం వంటి ఆచారాలను పాటిస్తూ వివాహం చేసుకోవడం విశేషం. త్వరలోనే హైదరాబాద్ లో అతిధులందరికీ రిసెప్షన్ ఇస్తారని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం కు రాజావారు..రాణిగారు తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం హిట్ మూవీ అనిపించుకుంది. తర్వాత నటించిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ‘క’పైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ యువ హీరో.

వివాహమైన తర్వాతైనా లక్ కలిసొచ్చి కిరణ్ అబ్బవరం హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా సోషల్ మీడియాలో ఈ యువజంటను ఆశీర్వదిస్తూ తెలుగు అభిమానులు పోస్టింగులు పెడుతున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది. అయితే అందరూ ఎట్టకేలకు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ఒక్కటయ్యారు. ఎస్ ఆర్ కళ్యాణమండపంలో ఈ రాజావారు రాణిగారు ఒక్కటవ్వడం సంతోషదాయకం అని ఈ జంటను మనసారా ఆశీర్వదిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×