E-Paper
Advertisement

Toofan: ‘ఇతడెవరు..’ అంటున్న విజయ్ ఆంటోని.. షేక్ చేస్తున్న‘తుఫాన్’ లిరికల్ సాంగ్

Toofan: ‘ఇతడెవరు..’ అంటున్న విజయ్ ఆంటోని.. షేక్ చేస్తున్న‘తుఫాన్’ లిరికల్ సాంగ్
Advertisement

Toofan Vijay Antony: హీరో విజయ్ ఆంటోని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్పినిటీ ఫిల్మ్ మెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ మూవీలో శరత్ కుమార్, సత్యరాజ్, దాలి ధనుంజయ, మురళీశర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలా ఉండగా, తాజాగా, ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ‘ఇతడెవరు ఇతడెవరు తెలియని ఓ చరితో, లోతైన ఓ కడలో.. తను గాథో ఎద బాధో..తను ఉరుమో లేక పిడుగో..’ అంటూ హీరో ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో ఈ సాంగ్ కొనసాగుతోంది. ఈ లిరికల్ సాంగ్ ను విజయ్ ఆంటోని కంపోజ్ చేయగా.. భాష శ్రీ గుర్తిండిపోయే మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ ను సంతోష్ హరిహరన్ పాడారు.

Advertisement

తెలుగు సినిపరిశ్రమలో విజయ్ ఆంటోని తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగు అభిమానులు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల లవ్ గురు సినిమాతో పలకరించిన విజయ్ ఆంటోని..ఈసారి పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ ‘తుఫాన్’గా ముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఒక దీవిలో జరిగే కథతో రూపిందించినట్లు తెలుస్తోంది. ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అతను ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడనే విషయాలపై డైరెక్టర్ యాక్షన్ తోపాటు అనుబంధాలు, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది.

తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథగా రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ ను సైతం అండమాన్, డయ్యూ డమన్ లలో తీయడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా, విడుదల చేసిన లిరికల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరిస్తుందా? లేదా? చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×