E-Paper
Advertisement

Dil Raju : దిల్ రాజు గుప్పిట్లో టాప్ హీరోలు.. పెద్ద ప్లానే ఇది

Dil Raju : దిల్ రాజు గుప్పిట్లో టాప్ హీరోలు.. పెద్ద ప్లానే ఇది
Advertisement
Dil Raju

Dil Raju : టాప్ హీరోలను గ్రిప్‌లో పెట్టుకున్నాడు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఒకప్పుడు దిల్ రాజు ఏ సినిమా స్టార్ట్ చేసినా హిట్టే. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన నిర్మాత. దిల్ సినిమా నుంచి చూసుకుంటే.. హిట్లే ఎక్కువ. పాపం ఈ మధ్య కాస్త బూమరాంగ్ అవుతోంది. శాకుంతలం సినిమా అతిపెద్ద జర్క్ ఇచ్చింది. అయినా సరే.. దిల్ రాజు ఎక్కడా తగ్గడం లేదు, తగ్గాల్సిన అవసరం కూడా లేదు. రాబోయే సినిమాలు అన్నీ టాప్ హీరోలతోనే. ఇండస్ట్రీ హిట్స్, సూపర్ డూపర్ హిట్స్ ఖాయం. అందునా, దిల్ రాజు చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

ఇప్పటికే ఎన్టీఆర్, ప్రభాస్‌తో భారీ సినిమాలు చేయబోతున్నారు. ఈ ఇద్దరితో సినిమా అంటే పాన్ ఇండియానే. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా లాక్ అయిందని తెలిపిన రాజు.. 2024లో మరో పెద్ద సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇక్కడితో ఆగిపోలేదు. ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయ్. ఒకప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోలందరితో ఓ రౌండ్ సినిమాలు చేసేశాడు దిల్ రాజు. ఆర్య-అల్లు అర్జున్, బృందావనం-ఎన్టీఆర్, మిస్టర్ పర్ఫెక్ట్-ప్రభాస్, ఎవడు-రామ్ చరణ్‌తో మంచి హిట్స్ అందుకున్నాడు. ఆ తరువాత ఈ హీరోలకు దూరం అయ్యాడు. ఇప్పుడు కొన్ని సినిమాలతో చేతులు కాలడంతో.. మళ్లీ ఆ స్టార్ హీరోలందరితో సెకెండ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాడు ఈ టాప్ ప్రొడ్యూసర్.

Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తోనూ భారీ సినిమా చేయబోతున్నాడు. ఇది వరకే పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ సినిమా తీశాడు. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. ఇక మహేశ్ బాబును కూడా లైన్లో పెట్టాడు. కాకపోతే రాజమౌళితో మహేశ్ సినిమా చేయబోతున్నాడు. అంటే కనీసం రెండేళ్ల వరకు ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు. అయినా సరే రెండు మూడేళ్లు వెయిట్ చేసి మరీ మహేశ్ బాబుతో సినిమా చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. రాజమౌళి తరువాత మహేశ్ సినిమా తమ బ్యానర్ నుంచే అని ఇప్పటికే ప్రకటించాడు కూడా.

ఓవైపు ఎన్టీఆర్, ప్రభాస్‌తో సినిమాలు లాక్ అయ్యాయి. అల్లు అర్జున్‌తో ఆల్రెడీ కథా చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్‌తో తీస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఆల్రడీ సెట్స్ పై ఉంది. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇలా టాప్ హీరోలనందరినీ లాక్ చేసి పెట్టుకున్నాడు దిల్ రాజు. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×