BigTV English
Advertisement

The Great Finishers : నాలుగో స్థానంలో వస్తారు.. గేమ్ ఫినిష్ చేస్తారు.. ది గ్రేట్ ఫినిషర్స్

The Great Finishers : నాలుగో స్థానంలో వస్తారు.. గేమ్ ఫినిష్ చేస్తారు.. ది గ్రేట్ ఫినిషర్స్


The Great Finishers : ఏ మ్యాచ్‌లో అయినా సరే.. ఏ జట్టులోనైనా సరే.. నాలుగో పొజిషన్‌లో ఒకరు గ్రౌండ్‌లోకి వచ్చారంటే అర్థం.. ఓపెనర్లు లేదా రెండు వికెట్లు పోయినట్టే. అంటే.. దాదాపు జట్టు కష్టాల్లో ఉన్నట్టే. ఓపెనర్లు ధాటిగా ఆడి ఔట్ అయితే ఫర్వాలేదు గానీ.. పెద్దగా పరుగులు చేయకుండానే వెనుదిరిగితే మాత్రం ఆ భారం మొత్తం మోయాల్సింది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెనే.  అలా ఫోర్త్ పొజిషన్‌లో వచ్చి.. మ్యాచ్‌ను గెలిపించిన వాళ్లున్నారు. ఓవైపు వికెట్లు పడుతున్నా… సగం ఓవర్లు అయిపోయినా.. ఇక మ్యాచ్ చేజారినట్టే అనుకున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు.

1. హార్థిక్ పాండ్యా
ఐపీఎల్ టీ20లో గ్రేట్ ఫినిషర్స్ అంటే ధోనీ, కీరన్ పొలార్డ్ మాత్రమే అనుకుంటారు. కాని, హార్థిక్ పాండ్యా కూడా ఫినిషరే. గుజరాత్ టైటన్స్‌ జట్టులో ఉన్న ప్రామిసింగ్ ఫినిషర్ పాండ్యానే. గత సీజన్ నుంచి ఇప్పటి వరకు ఫోర్త్ పొజిషన్ లోనే వస్తున్నాడు హార్థిక్ పాండ్యా. నిజానికి గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ కూడా చాలా కీలక ఆటగాడు. ఆటను చివరి వరకు తీసుకెళ్లగలడు. ఈ సీజన్ ఐపీఎల్ స్టార్టింగ్‌లో అలాంటి గేమ్స్ కూడా ఆడాడు. కాకపోతే, సాయి సుదర్శన్‌ను టాప్ పొజిషన్‌లో దింపుతున్నాడు పాండ్యా.


2. శార్దుల్ ఠాకూర్
శార్దుల్ ఠాకూర్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తీసుకున్న పర్పసే వేరు. బాల్ అండ్ బ్యాట్‌లో సత్తా చాటుతాడని జట్టులో అవకాశం ఇస్తూ వస్తున్నారు. అయితే, శార్దుల్ ఠాకూర్ మాత్రం బాల్‌తో పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదు. కాని, బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా గేమ్ ఫినిషర్‌గా మారాడు. మొదట వికెట్లు పడినప్పుడు కోల్ కతా జట్టు ఆధారపడుతున్నది శార్దుల్ ఠాకూర్ పైనే. ఒకే ఒక్క సందర్భంలో తప్ప శార్దుల్ ఠాకూర్.. ప్రతిసారి నాలుగో పొజిషన్‌లో దింపుతున్నారు. నిజానికి లాస్ట్ సీజన్‌లో టాప్ ఆర్డర్‌లో దింపినప్పటికీ.. సరిగా ఆడలేకపోయాడు. అందుకే, నాలుగో స్థానంలో పంపిస్తున్నారు.

3.ఆయుష్ బదోని
ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను గత సీజన్‌లో ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపారు. జట్టు నమ్మకాన్ని నిలబెడుతూ లక్నోను ఎన్నోసార్లు గెలిపించాడు కూడా. గ్రేట్ ఫినిషర్‌గా లాస్ట్ సీజన్ నుంచే పేరు తెచ్చుకున్నాడు ఆయుష్. ఈసారి మూడు లేదా నాలుగో స్థానంలో దింపుతున్నారు. నిజానికి లక్నో జట్టులో చాలా మంది పవర్ హిట్టర్స్ ఉన్నారు. అయినా సరే ఆయుష్‌ను పంపిస్తున్నారంటే కారణం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆయుష్ ఆడిన తీరే. ఆ ట్రోఫీలో గేమ్ ఫినిషర్ బదోనీనే. అందుకే. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆయుష్‌ను ముందుగా పంపిస్తున్నారు. 

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×