E-Paper
Advertisement

Tripti Dimri: నేను ఎవ్వరినీ మోసం చేయలేదు.. తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన ‘యానిమల్’ బ్యూటీ

Tripti Dimri: నేను ఎవ్వరినీ మోసం చేయలేదు.. తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన ‘యానిమల్’ బ్యూటీ
Advertisement

Tripti Dimri : కొందరు నటీనటులకు ఫేమ్ రావడానికి ఒక్క సినిమా చాలు. అలా ఒక్క సినిమాతో ఎంతోమంది యాక్టర్ల జీవితాలు మారిపోయాయి. అలాగే ‘యానిమల్’ అనే మూవీ బాలీవుడ్ భామ తృిప్తి దిమ్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అందులో తను హీరోయిన్ కాదు.. ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు.. అయినా స్క్రీన్‌పై కనిపించిన కాసేపు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది తృిప్తి. అంతే కాకుండా ఆ ఒక్క సినిమా వల్ల ప్రస్తుతం తన చేతిలో అరడజను ఆఫర్లు ఉన్నాయి. ఇక తను హీరోయిన్‌గా నటించిన ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ త్వరలో విడుదల కానుండగా తనపై చీటింగ్ ఆరోపణలు వచ్చాయి. దానిపై తృిప్తి స్పందించింది.

నెగిటివ్ కామెంట్స్

Advertisement

‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తృిప్తి దిమ్రీ ఒక ఈవెంట్‌కు అటెండ్ అవ్వాల్సి ఉందని, డబ్బులు తీసుకొని ఆ ఈవెంట్‌కు హాజరు కాలేదని ఆర్గనైజర్లు సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. ఈవెంట్ కోసం అన్నీ సిద్ధమయినా కూడా తృిప్తి హాజరు కాలేదని తన ఫోటోపై బ్లాక్ పెయింట్ వేస్తూ నిరసన చేశారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ‘యానిమల్’ మూవీతో విపరీమైన పాపులారిటీ రావడంతోనే తృప్తి ఇలా చేసిందని, ఒక్క సినిమా హిట్ అయితే ఇంత పొగరు పనికిరాదని నెటిజన్లు విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో తృిప్తి దిమ్రీ టీమ్.. దీనిపై వివరణ ఇచ్చింది.

Also Read: హలో వెబ్‌సైట్లూ… ఇకనైనా ఆపండి… సమంత ఆట వస్తువు కాదు.

Advertisement

కమిట్మెంట్ ఇవ్వలేదు

‘‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తృిప్తి దిమ్రీ అన్నీ ఈవెంట్స్‌కు హాజరవుతోంది. తన షెడ్యూల్‌ను కచ్చితంగా ఫాలో అవుతోంది. ఈ ప్రమోషన్స్ కాకుండా తను మరే ఇతర ఈవెంట్స్‌లో పాల్గొంటానని చెప్పలేదు. కమిట్మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి ఈవెంట్స్‌లో పాల్గొనడం కోసం తను ఎలాంటి ఫీజు కూడా తీసుకోలేదని మేము క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాం’ అంటూ తృిప్తి దిమ్రీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌కు కాస్త బ్రేక్ పడింది. తన పాపులారిటీని అడ్డం పెట్టుకొని కావాలనే కొందరు ఇలా నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నారని తన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇందులో నిజమెంత అనే విషయం ఎవరికీ క్లారిటీ లేదు.

ఇంటికి వెళ్లి ఏడ్చేదాన్ని

రాజ్ కుమార్ రావుతో తను కలిసి నటించిన ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది తృప్తి దిమ్రీ. అసలు యాక్టర్ అవ్వాలనే ఆలోచన తనకు లేదని, కానీ చదువుల్లో వెనకబడి ఉండేదాన్ని కాబట్టి యాక్టింగ్‌లో ట్రై చేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక ‘లైలా మజ్ను’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు ముందుగా తను సెలక్ట్ అవ్వలేదని కానీ తను కశ్మీర్ అమ్మాయిలాగా ఉండడంతో పదేపదే వెంటపడి తనకు ఆ మూవీ ఛాన్స్ ఇచ్చారని తెలిపింది. మొదట్లో తనకు అసలు సినిమాల గురించి అర్థం కాక షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకుంది తృిప్తి దిమ్రీ.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×