E-Paper
Advertisement

Trisha Krishnan: రాజమౌళి ఆఫర్ నే రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ?

Trisha Krishnan: రాజమౌళి ఆఫర్ నే రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ?
Advertisement

Trisha Krishnan: ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టు.. ఇండస్ట్రీలో హిట్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కు కూడా రాసిపెట్టి ఉండాలి. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావాలి అంటే పెట్టి పుట్టాలి. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కుర్ర హీరోయిన్ నుంచి సీనియర్ హీరోయిన్ వరకు జక్కన్న సినిమాలో నటించడం పెద్ద డ్రీమ్ గా పెట్టుకుంటారు. కానీ, జక్కన్న పిలిచి ఛాన్స్ ఇస్తానని చెప్పినా.. ఒక స్టార్ హీరోయిన్ నో చెప్పిందంట. విడ్డూరంగా ఉందా.. ? ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. చెన్నై సోయగం త్రిష.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఉన్న త్రిషకు గతంలో జక్కన్న నుంచి ఒక ఆఫర్ వచ్చిందంట. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఒక చిన్న సినిమా చేయాలనీ రాజమౌళి అనుకున్నాడు. ఆ సమయంలోనే మర్యాద రామన్న కథను రాసుకున్నాడు. అది స్టార్ హీరోలకు సెట్ అయ్యే కథ కాకపోవడంతో కమెడియన్ సునీల్ ను హీరోగా అనుకున్నాడు. అప్పటికే సునీల్ ఒక పక్క హీరోగా చేస్తున్నాడు.

Advertisement

ఇక సునీల్ పాత్ర కామెడీగా ఉన్నా.. హీరోయిన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతుండగా త్రిషను తీసుకోవాలని భావించారట. అలానే ఆమెను సంప్రదించగా.. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో కమెడియన్ పక్కన చేస్తే బావుండదేమో అని సంకోచించి జక్కన్న ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. దీంతో త్రిష ప్లేస్ లో సలోనిని తీసుకున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఒకవేళ సలోని ప్లేస్ లో త్రిష ఉండి ఉంటే.. ఆమె రేంజ్ ఈపాటికి వేరేలా ఉండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు జక్కన్న సినిమాలో హీరోయిన్ గా ఆమె కావాలనుకున్నా అది కుదరని పని. మరి ముందు ముందు ఈ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×