BigTV English

Pooja Hegde:- పూజా హెగ్డే కోసం త్రివిక్రముడు రావాల్సిందే.. ఐరన్ లెగ్‌ స్టేటస్ మార్చాల్సిందే

Pooja Hegde:- పూజా హెగ్డే కోసం త్రివిక్రముడు రావాల్సిందే.. ఐరన్ లెగ్‌ స్టేటస్ మార్చాల్సిందే

Pooja Hegde:- పూజా హెగ్డే గోల్డెన్ పిరియడ్ అయిపోయింది. ఈమధ్య చేస్తున్న ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోంది. అసలే వస్తున్న అవకాశాలు అంతంత మాత్రం. పైగా కుర్ర హీరోయిన్లు దూసుకొస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఇంపోర్ట్ అవుతున్నారు. ఈ సమయంలో ఇంకా పూజా హెగ్డేను చూడ్డం అంటే గొప్పే. పోనీ, మంచి హిట్లు పడితే ఆ లెక్క మరోలా ఉండేది. కాని, పూజా హెగ్డే హిట్స్ చూసి చాలా కాలం అయింది. దువ్వాడ జగన్నాథం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వరకు పూజా హెగ్డే సినిమాలన్నీ హిట్టే. పైగా బడా స్టార్స్ తో చేసిందీ పూజా. జస్ట్ రెండేళ్ల గ్యాప్ లోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ తో నటించింది. చివరికి ఫ్లాప్స్‌లో ఉన్న అఖిల్ కి కూడా హిట్ ఇచ్చింది. పైగా పెద్ద స్టార్స్ తో చేసిన సినిమాలన్నీ రికార్డ్ కలెక్షన్స్ తో హిట్ అయినవే. సో, ఆ పిరియడ్ లో పూజా హెగ్డేకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.


కాని, 2022లో పూజా హెగ్డే సినిమాలకు గ్రహణం పట్టింది. పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేసినా సరే.. ఒక్క బొమ్మ కూడా హిట్ అయింది లేదు. రాధే శ్యాం, బీస్ట్, ఆచార్య, రణవీర్ సింగ్ తో సర్కస్ లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించినా.. అందులో ఒక్కటి కూడా సరిగా ఆడలేదు. పైగా పూజా హెగ్డే అడుగు పెడితే సినిమా ఫట్టే అన్న టాక్ వచ్చేసింది ఇండస్ట్రీలో. చివరికి సల్మాన్ ఖాన్ కూడా రక్షించలేకపోయాడు. ఈద్ సందర్భంగా రిలీజ్ చేసే సల్మాన్ సినిమాలన్నీ దాదాపుగా హిట్ అవుతాయి. ఆ సెంటిమెంట్ తో రిలీజ్ చేసినా సరే.. ఏదో సో సో గా నడుస్తోంది కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా. సో, ఈ బాలీవుడ్ సినిమా కూడా పూజాను గట్టెక్కించలేకపోయింది.

పూజా హెగ్డే తిరిగి ట్రాక్ లో పడాలంటే హిట్ పడాల్సిందే. ఇప్పటికిప్పుడు పూజా హెగ్డేని గట్టెక్కించేది ఎవరు? వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోయిన్ ను తీసుకునేది ఎవరు? ఉన్నాడు… ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అరవింద సమేత, అల వైకుంఠపురం సినిమాలతోనే పూజా హెగ్డే పెద్ద స్టార్ అయింది. ఈ రెండు సినిమాల్లో పూజా హెగ్డేకు గట్టి క్యారెక్టర్స్ పడ్డాయి. సాధారణంగా హీరోయిన్ అంటే పాటలకే పరిమితం అవుతున్న ఈ కాలంలో.. త్రివిక్రమ్ మంచి రోల్స్ ఇచ్చాడు. పైగా త్రివిక్రమ్ సినిమా హిట్ అయితే రికార్డ్సే. అందులోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా. ఈ సినిమా హిట్ అయితే.. పూజా హెగ్డే తిరిగి పట్టాలెక్కినట్టే. అందుకే, మహేశ్ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది పూజా.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×