Big Stories

Husband: 40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..

man shadow

Husband: ఒక వ్యక్తిగి మాగ్జిమమ్ ఎంత మంది భార్యలు ఉండొచ్చు. ఒక్కరు.. ఇద్దరు.. ముగ్గురు.. కొంచెం అటూఇటూ. అప్పటికే అతనికి చుక్కలు కనిపిస్తాయి. కానీ, ఓ వ్యక్తికి మాత్రం ఏకంగా 40 మంది భార్యలు ఉన్నారు. వారంతా తమ భర్త అతనేనని చెబుతున్నారు. ఏంటి సంగతి?

- Advertisement -

కులగణన అధికారులు ఓ ఇంటికి వెళ్లారు. అక్కడో మహిళ ఉంది. పేరు, వివరాలు అడిగారు. చెప్పింది. రాసుకుని వెళ్లిపోయారు. అదే అధికారులు మరో ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి మహిళ నుంచి వివరాలు సేకరించారు. అలా అలా మొత్తం 40 మంది నుంచి కులగణన డేటా నమోదు చేశారు. ఆ వివరాలు చూసి అధికారులు షాక్. ఎందుకంటే.. ఆ 40 మంది మహిళల భర్త పేరు ఒక్కటే. ‘రూప్‌చంద్’.

- Advertisement -

అదేంటి? ఒకే ఏరియాలో.. అంతమంది మహిళలకు ఒక్కడే భర్త ఉండటం ఏంటి? రూప్‌చంద్ అనే వ్యక్తి 40 మంది భార్యలను మెయిన్‌టెన్ చేస్తున్నాడా? అనే ఆసక్తి వారిలో పెరిగింది. వేరు వేరుగా విచారిస్తే.. వాళ్లంతా చెప్పింది ఒకే రూప్‌చంద్ గురించి. అతనో డ్యాన్సర్.

వామ్మో.. ఆ డ్యాన్సర్ మామూలోడు కాదనుకున్నారు అధికారులు. 40 మంది భార్యలతో పాటు అనేక మంది పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలను పిలిచి మీ నాన్న పేరేంటి అని అడిగితే.. వాళ్లు కూడా రూప్‌చంద్ అని చెప్పారు. ఇదెలా సాధ్యం? ఒక్కడే అంత మందితో ఎలా? కులగణనకు వచ్చిన సిబ్బందికి మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు.

అధికారులు కులగణన కోసం వెళ్లింది ఓ రెడ్‌లైట్ ఏరియాలోకి. అక్కడ ఉన్న మహిళలంతా శరీరాన్ని అమ్ముకునే వారే. మరి, వారికి భర్త ఉండడా? అంటే ఉండడు. యజమాని మాత్రమే ఉంటాడు. మనిషన్నాక జనాభా లెక్కల్లో ఉండాలిగా. అందుకే, వారికి సంబంధించిన అన్ని ప్రభుత్వ రికార్డుల్లోనూ తమ భర్తగా రూప్‌చంద్ పేరును నమోదు చేసుకున్నారు. అలా ఒకరిని చూసి ఇంకొకరు. పిల్లలు పుడితే.. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, స్కూల్ అడ్మిషన్.. ఇలా అన్నిచోట్ల తండ్రి పేరు స్థానంలో రూప్‌చంద్ పేరే. అలా ఆ రూప్‌చంద్.. 40 మంది మహిళలకు భర్తగా మారాడు.

ఇక్కడో డౌట్ రావొచ్చు. రూప్‌చంద్ అనే ఎందుకు? ఏ హృతిక్ రోషన్ అనో పెట్టుకోవచ్చుగా అని. రూప్‌చంద్ పేరు పెట్టుకోవడానికీ ఓ రీజన్ ఉందంటున్నారు వారంతా. ఆ రెడ్‌లైట్ ఏరియాలో ఓ డ్యాన్సర్ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. వారితో బాగా కలిసిపోయాడు. మంచిగా మెదిలేవాడు. దీంతో.. ఆ రెడ్‌లైట్ ఏరియా మహిళలందరూ రూప్‌చంద్‌ను తమ ఇంటి వాడిగానే చూసేవారు. అతడిపై ఉన్న అభిమానంతోనే తమ భర్త పేరు స్థానంలో రూప్‌చంద్ అని పేరు నమోదు చేసుకున్నారు. తమ పిల్లలకు తండ్రిగానూ రూప్‌చంద్ పేరే చెబుతున్నారు. ఇదీ బీహార్‌లోని అర్వల్ జిల్లాలోని సంగతి. ఇక, కులగణన కోసం వెళ్లిన ప్రభుత్వ అధికారులు.. ఆ మహిళలకు ఎలాంటి కులం లేదని తేల్చడం కొసమెరుపు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News