BigTV English

Vishwambhara: ఆదిపురుష్ కన్నా ఎక్కువ ట్రోల్ అవుతుంది.. అదేం ఎడిటింగ్ రా అయ్యా

Vishwambhara: ఆదిపురుష్ కన్నా ఎక్కువ ట్రోల్ అవుతుంది.. అదేం ఎడిటింగ్ రా అయ్యా

Vishwambhara:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార లాంటి హిట్ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొట్టమొదటిసారి చిరు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక నేడు విజయదశమి సందర్భంగా విశ్వంభర టీజర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. విశ్వం యొక్క ఆధ్యాత్మిక రహస్యం అంటూ మొదలైన ఈ టీజర్ లో ఒక సరికొత్త ప్రపంచాన్ని వశిష్ట చూపించాడు. ముఖ్యంగా రెక్కల గుర్రంపై మెగా వీరుడుగా  వచ్చిన చిరంజీవి ఎంట్రీ గూస్ బంప్స్  అనే చెప్పాలి ఇందులో దుష్టశక్తులపై మెగా వీరుడు ఎలా యుద్ధం చేశాడు అనేది జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించినట్లు కనిపిస్తోంది.

అయితే ఈ టీజర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అంటగా ఏమీ బాగాలేదని పెదవి విరుస్తున్నారు. ఎడిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అంతా ఏదో చిన్న పిల్లలు చూసే కార్టూన్స్ బొమ్మల్ లాగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ టీజర్ చూశాక ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయని దానికంటే దారుణంగా విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.


ఇక ఇంకోపక్క ఈ టీజర్ మొత్తం హాలీవుడ్ సినిమాకు కాపీ అని అవతార్, మార్వెల్ స్టూడియోస్, కల్కి, ఆదిత్య 369 ఇలాంటి సినిమాల్లో చూపించిన విజువల్స్ అన్ని కాపీ చేసి టీజర్ ను  రిలీజ్ చేసినట్లు ఆధారాలతో సహా నెటిజన్స్  సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ చిన్నపిల్ల ముఖం.. అవతార్ నుంచి కొట్టేశారని, ఇక ఆ విశ్వం.. మార్వెల్ స్టూడియో నుంచి కొట్టేశారని.. ఇక చిరు ఎంట్రీ కూడా బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం నుంచి తీసుకున్నారని అందుకు సంబంధించిన వీడియోలతో చూపిస్తున్నారు.

చిరంజీవి సినిమా కోసం ఎదురుచూస్తుంటే.. ఇలాంటి సినిమానా మీరు ఇచ్చేది అని మేకర్స్ పై మండిపడుతున్నారు. కార్టూన్ బొమ్మలు చూపించినట్లు చూపించారు. ఇది అస్సలు బాలేదని, దీనికన్నా ఆదిపురుష్ నే మేలు అని ట్రోల్ చేస్తున్నారు. కనీసం అందులో అయినా కొత్త టెక్నాలజీ ఉపయోగించి చూపించారు. కానీ, ఇందులో అన్ని సీన్స్ కాపీ కొట్టి తీసుకొచ్చారని చెప్పుకొస్తున్నారు.  ఇక ఈ టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్ సైతం అదే డిటింగ్ రా అయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ సినిమా ట్రోల్స్ పై మేకర్స్ ఏమంటారు చూడాలి

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×