BigTV English

Tollywood Hero’s: ఈసారైనా ఈ హీరోలు గట్టెక్కేరా..?

Tollywood Hero’s: ఈసారైనా ఈ హీరోలు గట్టెక్కేరా..?

Tollywood Hero’s.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇందులో చాలామంది ఒక్క హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అడపా దడపా సినిమాలు చేస్తున్నా కొంతమందికి అదృష్టం వరించలేదు. మరి కొంతమంది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా వారి సినిమాలు సక్సెస్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే కనీసం ఒక్క సినిమా అయినా విజయం సాధించాలని తహతహలాడుతున్నారు. మరి ఈ ఏడాది వారు కోరుకున్న విజయం వరిస్తుందా..? అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే కొంతమంది హీరోలు ఒక్క హిట్ కోసం ఎంతగానో పరితపిస్తున్నారు. మరి ఈ హీరోలు గట్టెక్కుతారో లేదో ఇప్పుడు చూద్దాం.


గోపీచంద్..

గోపీచంద్.. సరైన విజయం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కావ్య థాపర్ హీరోయిన్ గా, చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై టీ.జీ. విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ఇది. దసరా సందర్భంగా బరిలోకి దిగింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


నితిన్..

విజయం కోసం ఆరాటపడుతున్న మరో హీరో నితిన్.. డిసెంబర్ 20వ తేదీన రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరొకవైపు ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని నితిన్ తాపత్రయ పడుతున్నారు. మరి నితిన్ తాపత్రయానికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

నాగచైతన్య..

లవ్ స్టోరీ సినిమా తర్వాత ఈయన నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. ముఖ్యంగా కమర్షియల్ విజయం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు నాగచైతన్య. ఇటీవల వచ్చిన కస్టడీ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఇక ఇప్పుడు తాజాగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో మరోసారి సాయి పల్లవి జత కట్టనుంది. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్నారు చందు మొండేటి. ముఖ్యంగా చందు మొండేటి తండేల్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. మరి ఈ సినిమా నాగచైతన్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మంచు విష్ణు..

మంచు వారసుడు మంచు విష్ణు సక్సెస్ కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయాన్ని అందించలేదు.. అందుకే ఈసారి కన్నప్ప సినిమాతో సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు.. అందులో భాగంగానే చాలామంది క్రేజీ స్టార్స్ ను ఇందులో భాగం చేశారు.. భక్తిరస ప్రధానంగా సాగే ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి మంచు విష్ణు కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి..

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×