Big Stories

Unstoppable with Prabhas : అప్పుడే పెళ్లి చేసుకుంటానేమో.. మ్యారేజ్‌పై ప్ర‌భాస్ పంచ్‌

Unstoppable with Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్న ప్రోమో వ‌చ్చేసింది. ఆ ప్రోమో ఆయ‌న సినిమాలోనిది కాదండి.. బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2 షోలోనిది. ఈ షో రెండో సీజ‌న్ న‌డుస్తుంది. అందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్‌ను ప్ర‌భాస్‌, హీరో గోపీచంద్‌పై చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్‌గా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా నిర్వాహ‌కులు రిలీజ్ చేశారు.

- Advertisement -

ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ నెక్ట్స్ రేంజ్‌లో ఉండ‌నుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ప్ర‌భాస్‌పై బాల‌య్య విసిరిన పంచ్‌లు.. వాటికి ప్ర‌తిగా ప్ర‌భాస్ బాల‌య్య‌పై విసిరిన పంచ్‌లు పిచ్చ కిక్ ఇస్తున్నాయి. ఇక ప‌నిలో ప‌నిగా ప్ర‌భాస్‌ను బాల‌కృష్ణ పెళ్లి గురించి కూడా అడిగేశాడు. మొన్న శ‌ర్వానంద్ షోకు వ‌చ్చిన‌ప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ‌ని అడిగితే ప్ర‌భాస్ చేసుకున్న త‌ర్వాత అన్నాడు. మ‌రి నువ్వేప్పుడు పెళ్లి చేసుకుంటావు అని డార్లింగ్‌ను అడిగితే.. సల్మాన్ ఖాన్ పెళ్లి త‌ర్వాత అని ప్ర‌భాస్ ఇచ్చిన పంచ్ మామూలుగా లేదు. ఇక రామ్ చ‌ర‌ణ్ ఫోన్‌లోకి వ‌చ్చి ప్ర‌భాస్‌ను ఆట ప‌ట్టించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

ప్ర‌భాస్ క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్ షోలో ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత షో ఇంకా ర‌స‌కందాయంలోకి వెళ్లిన‌ట్లు ప్రోమో చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. కొత్త సంవత్స‌రం సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 30న ప్ర‌భాస్ ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు ఆహా నిర్వాహ‌కులు తెలియ‌జేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News