Big Stories

After Eating: అన్నం తిన్న తర్వాత ఈ 5 పనులు చేస్తున్నారా….?

After Eating: భోజనం చేసేటప్పుడు ఎలా ఉండాలో ఏం చేయకూడదో ధర్మశాస్త్రంలో చెప్పబడింది. భోజనం చేసేటప్పుడు మౌనంగా తినమని శాస్త్రం చెబుతోంది . అలాగే కోపంతో కూడా భోజనం చేయకూడదు. అలా తినే తిండి ఒంటికి పట్టదు. అన్నం తినేది శరీరానికి బలం కోసమే కాదు. మనం తినే తిండి మన మనస్సుగా మారుతుంది. అలాగే అన్నం తినేటప్పుడు ఉప్పు తక్కువైతే కంచంలో కలుపుకో కూడదు. వండిన గిన్నెలో కలిపి తీసుకుని వేసుకోవచ్చు. ఉప్పును నేరుగా వడ్డించుకుంటే గోమాంసాన్ని వడ్డించుకున్నట్టేనని శాస్త్రం చెబుతోంది. అది,ఉప్పైనా, కారమైనా, పులుపైనా సరే..

- Advertisement -

అన్నం తిన్నవెంటనే కంచంలో చేతులు కడుగుకోకూడదు.తిన్న తర్వాత పక్కకెళ్లి చేతులు బయట కడగాలి తప్ప.. కంచంలో కడగడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుంది. చాలా మంది తిన్నవెంటనే కంచం ముందు నుండి లేచే అలవాటు ఉండదు. ఇది దరిద్రానికి సంకేతం. కాబట్టి తిన్నవెంటనే కంచం ముందునుండి లేవాలి. తినడం పూర్తవగానే పళ్లల్లో ఇరుక్కున్న ఆహారాన్ని పిన్నీసు పెట్టో, పుల్ల పెట్టే తీస్తుంటారు. అలాకాకుండా నీటితో పుక్కిలించాలి. కంచం లేదా ప్లేటులో పెట్టిన పదార్ధాలు ఎట్టిపరిస్థితుల్లో పారేయకూడదు. అదే వేరే వారికి ఉపయోగపడుతుంది. ఆ పడేసే అన్నం వేరే వాళ్లకు చెందాల్సిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చాలామంది అన్నం తినగానే ఒళ్లు విరుచుకోవడం చేస్తుంటారు. ఇది పరమదరిద్రానికి హేతువు. ఒళ్లు విరుచుకోవడం లేదంటే తినగానే పడుకోవడం కూడా సరియైన విధానం కాదని శాస్త్రం చెబుతోంది. భోజనం ముగించగానే చాలామంది చేతులు కడుక్కుని తడి చేతుల్ని విదులుస్తారు. అలా విదల్చడం చేయకూడ‌దు. ఇది దరిద్రానికి కార‌ణమ‌వుతుంది.

- Advertisement -

నువ్వు కడుపుకు ఎంత అన్నం తినగలవో అంత సంపాదించమని,….అంతే దాచుకోమని శాస్త్త్రం చెబుతోంది. అన్నం తినేటప్పుడు అబద్ధాలు ఆడకూడదు. అలాగే అన్నం తినేటప్పుడు విస్తరి చుట్టూతోపాటు అన్నంపైన కూడా మంత్రంతో నీళ్లు చల్లాలి. అది శుద్ధి కోసం మాత్రమే. కొంతమంది అన్నం తినేటప్పుడు ఒక ముద్దను పక్కన పెడుతుంటారు. దాన్నే బూతపడి అంటారు. ఆ అన్నం కుక్కలకు, లేదా కాకులకో పెట్టాలి. భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించుకోవాలి. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధిచేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News