E-Paper
Advertisement

Upasana : ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ ఖుషీ..

Upasana : ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ ఖుషీ..
Advertisement

Upasana : మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన వ్యక్తి అంశాలను అభిమానులతో పంచుకుంటారు. చెర్రీ, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి తొలుత ప్రకటించగానే ఫ్యాన్స్ ఎంతో ఖుషీ అయ్యారు. చెర్రీ-ఉపాసన వివాహం అయి 10 ఏళ్లు దాటింది. అందుకే అభిమానులు ఈ జంట తల్లిదండ్రులు కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ -ఉపాసన దుబాయ్‌ లో ఉన్నారు. తాజాగా నమ్మోస్‌ బీచ్‌ క్లబ్‌లో ఉపాసన బేబీ షవర్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

‘మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‌కి ధన్యవాదాలు.’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వేడుకలో రామ్‌చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్‌ పాల్గొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసిన ఉపాసన తాజాగా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఉపాసన-రామ్ చరణ్ జంటకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కొన్నాళ్లు దుబాయ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసిన తర్వాత చరణ్‌–ఉపాసన ఇండియా చేరుకోనున్నారు. ఆ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌లో చెర్రీ పాల్గొనే అవకాశముంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×