BigTV English

Bandi Sanjay: ఏ1 బండి సంజయ్‌పై పెట్టిన కేసులివే.. సెక్షన్ 151తో చిక్కులేనా?

Bandi Sanjay: ఏ1 బండి సంజయ్‌పై పెట్టిన కేసులివే.. సెక్షన్ 151తో చిక్కులేనా?
bandi sanjay arrest

Bandi Sanjay: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణలో రాజకీయం రగులుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నా.. ఆయనపై బలమైన కేసులో పెట్టారు పోలీసులు. కమలాపూర్ పోలీసులు ఆయనపై ఐపీసీలోని 420, ఐటీ యాక్టులోని 66-డీ, తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ ప్రివెన్షన్ చట్టంలోని సెక్షన్ 4(ఏ), 6 సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. ఇక్కడితో సరిపెట్టలేదు పోలీసులు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 154, 157 ప్రకారం కూడా కేసు ఫైల్ చేశారు. ఇక కోర్టులో హాజరుపరిచే ముందు రిమాండ్ రిపోర్టులో సెక్షన్ 120ని కూడా జత చేశారు. పేపర్ లీక్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌లో బండి సంజయ్‌ను ఏకంగా ఏ1 గా చేర్చారు పోలీసులు.


మరి సెక్షన్‌ 151 అంటే ఏంటీ? ఎప్పుడు దీన్ని ఉపయోగిస్తారు? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయ్‌. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 151 ఉంది. ఈ చట్టం ప్రకారం… ఎవరైనా నేరం చేయకుండా అడ్డుకునేందుకు అరెస్ట్ చేయచ్చు. నేరం చేస్తున్నట్లు భావిస్తే, అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక పోలీస్ అధికారి ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అలాగే నేరం చేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదనిపించినప్పుడు కూడా సెక్షన్‌ 151ని ఉపయోగించొచ్చు. ఒకవేళ అరెస్ట్‌ చేసినా.. 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచకూడదు. సెక్షన్ 151 సిఆర్‌పిసి కింద ఉండే అధికారం రాష్ట్రంలోని ముందస్తు నిర్బంధ చట్టాల వంటివి.

సెక్షన్ 151 సీఆర్పీసీ కింద చర్య తీసుకొనే ముందు పోలీస్ అధికారి తప్పనిసరిగా ఆ వ్యక్తి ఏ నేరం చేసే అవకాశం ఉందో నమోదు చేయాలి. ముఖ్యంగా వై, జెడ్ క్యాటగిరీలలో భద్రత కల్పించిన నాయకుల విషయంలో తగు కారణాలు చూపించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉంటుంది.


ఇలా పదో తరగతి పేపర్ లీక్‌లో బండి సంజయ్ చుట్టూ బలమైన సెక్షన్లు పెట్టడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అరెస్టులకు బయపడేది లేదని.. కావాలంటే మరిన్ని జైళ్లు రెడీ చేసుకోండి అంటూ సవాల్ చేస్తున్నారు కమలనాథులు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×