E-Paper
Advertisement

Usha Uthup: సింగర్ ఉషా ఉతుప్ భర్త మృతి.. టీవీ చూస్తుండగానే..

Usha Uthup: సింగర్ ఉషా ఉతుప్ భర్త మృతి.. టీవీ చూస్తుండగానే..
Advertisement

Usha Uthup: సింగర్ ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త జానీ చాకో ఉతుప్‌(78) గుండెపోటుతో మృతి చెందారు. గతరాత్రి కోల్ కతాలోని తన నివాసంలో జానీ టీవీ చూస్తుండగా.. గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను దగ్గర్లోని హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నేడు ఆయన అంత్యక్రియలు కోల్ కతాలో జరగనున్నాయి.

ఇక ఉషా ఉతుప్ గురించి సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తొమ్మిదేళ్ల వయసునుంచే సంగీత ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. సంగీతకారుడు అమీన్ సయానీ ఒక రేడియో ఛానెల్‌లో పాడటానికి ఉషకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. తర్వాత చెన్నైలోని మౌంట్ రోడ్‌లోని నైన్ జెమ్స్ నైట్‌క్లబ్‌లో గాయనిగా మారింది.

Advertisement

ఇక ఒక క్లబ్ లో ఆమె పాటకు ఫిదా అయిన శశి కపూర్.. తన సినిమాలో ఉషాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, కొంకణి, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగుతో సహా 15 భారతీయ భాషలలో తన గాత్రాన్ని అందించింది. ఇంకా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, సింహళ, స్వాహిలీ, రష్యన్, నేపాలీస్, అరబిక్, క్రియోల్, జులు, స్పానిష్ తో సహా అనేక విదేశీ భాషలలో కూడా పాడింది.

తెలుగులో ఉషా అంటే హస్కీ వాయిస్. కీచురాళ్లు అనే సినిమాలో కీచురాళ్లు అనే సాంగ్ ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఇక రేసుగుర్రం టైటిల్ సాంగ్ తో కూడా ఉషా తెలుగువారికి సుపరిచితురాలు. ఆమెకు మొదట రాము అనే వ్యక్తితో వివాహమైంది. ఆయన మరణించాక.. ఉషా.. జానీని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక జానీ మరణ వార్త విన్న ప్రముఖులు.. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×