BigTV English

Realme GT6 Launched: కొత్త ఫోన్ వస్తోంది.. 50MP కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్.. రియల్‌మీ న్యూ స్మార్ట్‌ఫోన్!

Realme GT6 Launched: కొత్త ఫోన్ వస్తోంది.. 50MP కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్.. రియల్‌మీ న్యూ స్మార్ట్‌ఫోన్!

Realme GT6 Launched: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ ‘GT6’ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, 16GB RAM కలిగి ఉంటుంది. GT6 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు గురించి తెలుసుకుందాం.


Realme ‘GT6’ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2799 యువాన్ (సుమారు రూ. 32,130), 16GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3099 యువాన్ (సుమారు రూ. 35,580). 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 3399 యువాన్ (సుమారు రూ. 39,025) 1TB స్టోరేజ్ వేరియంట్ ధర 3899 యువాన్ (సుమారు రూ. 44,765). ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 15 నుండి చైనా మార్కెట్‌లో సేల్‌కి తీసుకొస్తున్నారు.

Also Read: Motorola Edge 50: మోటో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు ఓకే.. లాంచ్ ఎప్పుడంటే?


Realme GT6 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 2780×1264 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 8T LTPO AMOLED డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ 120Hz, పీక్ బ్రైట్నెసం 6000 నిట్‌ల వరకు ఉంటుంది. డిస్‌ప్లే క్రిస్టల్ ఆర్మర్ గ్లాస్ ప్రొటక్షన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది Adreno 750 GPUతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 4nm మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB / 16GB LPDDR5X RAM+256GB / 512GB / 1TB UFS 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్‌మీ UI 5పై రన్ అవుతుంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ మరియు హై-రెస్ ఆడియో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: Google Pixel 8 Price Cut: రూ.17 వేల డిస్కౌంట్.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 బ్యాక్ కెమెరా OIS సపోర్ట్‌తో f/1.88 ఎపర్చరు, 8 మెగాపిక్సెల్ IMX355 112 డిగ్రీ అల్ట్రా-వైడ్ కెమెరాతో f/2.2 ఎపర్చరు ఉంది. ముందు భాగంలో f/2.45 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. ఫోన్ IP65 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టవిటీ కోసం డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G SA/ NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7 802.11 be, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి.

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×