E-Paper
Advertisement

Valteru Veerayya Vs Veera Simha Reddy : వీర‌య్య హార్బ‌ర్‌కి… వీర‌సింహారెడ్డి అడ్డాకి పోలికేంటి?

Valteru Veerayya Vs Veera Simha Reddy : వీర‌య్య హార్బ‌ర్‌కి… వీర‌సింహారెడ్డి అడ్డాకి పోలికేంటి?
Advertisement

Valteru Veerayya Vs Veera Simha Reddy : మొన్న‌టికి మొన్నే వాల్తేరు వీర‌య్య హార్బ‌ర్ సెట్ చూపించి కేక పుట్టిస్తోంది మెగాస్టార్ అనిపించారు మైత్రీ మూవీ మేక‌ర్స్. సినిమా మేకింగ్ విజువ‌ల్స్ రిలీజ్ చేయ‌క‌పోయినా, వాల్తేరు వీర‌య్య హ్యూజ్ సెట్ చూసి వావ్ అన్నారు జ‌నాలు. ఇప్పుడు అందుకు ఏమాత్రం త‌గ్గ‌కుండా వీర‌సింహారెడ్డి లావిష్‌నెస్‌ని కూడా ఎలివేట్ చేయాల‌ని ఫిక్స్ అయిపోయారు. న్యూ ఇయ‌ర్ కోసం నంద‌మూరి అభిమానుల‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ప్యాక్ చేశారు. వీర‌సింహారెడ్డి మేకింగ్ విజువ‌ల్స్ ని రిలీజ్ చేశారు. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా వీర‌సింహారెడ్డి. అద్భుత‌మైన గుళ్ల‌ను చూపించారు మేకింగ్ వీడియోలో. ఎడ్ల పందేల‌ను కూడా తెర‌కెక్కించిన‌ట్టు ఉంది. దాంతో పాటు ఖాళీ గ్రౌండ్‌లో భారీ యాక్ష‌న్స్ సీక్వెన్స్ ని, వేలాది మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో తెర‌కెక్కించిన‌ట్టు కూడా అర్థ‌మ‌వుతోంది.

గోపీచంద్ మ‌లినేని యాక్ష‌న్ సీక్వెన్స్ తీయ‌డంలో దిట్ట‌. బాల‌కృష్ణ మాస్ డైలాగులు చెప్ప‌డంలో దిట్ట‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటే ఎక్స్ పెక్టేష‌న్స్ ఇంకో రేంజ్‌లో ఉంటాయి. ఇప్పుడు వాటిని రీచ్ అయ్యేలాగానే క‌ట్ చేశారు మేకింగ్ వీడియో. వీర‌సింహారెడ్డి సెట్స్ కి నారా బ్రాహ్మ‌ణి వెళ్లిన‌ట్టు కూడా ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ మ‌ధ్య అన్‌స్టాప‌బుల్ షోలో రెండో అమ్మాయి తేజ‌స్విని సంద‌డి చేశారు. గ‌తంతో పోలిస్తే బాల‌కృష్ణ సినిమా కెరీర్‌లో ఇద్ద‌రు కూతుర్లు యాక్టివ్‌గా క‌నిపిస్తున్నారు. మోక్ష‌జ్ఞ ఎప్పుడు క‌నిపిస్తారు బాల‌య్యా అంటూ న‌వ‌యువ‌ర‌త్న కోసం జ‌నాలు వెయిటింగ్‌. వీర‌సింహారెడ్డి మేకింగ్ వీడియోతో నంద‌మూరి అభిమానుల దిల్‌ఖుష్ చేసిన మైత్రీ మూవీ మేక‌ర్స్ మెగాఫ్యాన్స్ ని ప‌ట్టించుకోరా అంటూ అటు నుంచి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య మేకింగ్ వీడియో లోడ్ అవుతోందా మ‌రి..? జ‌స్ట్ ఆస్కింగ్ అంతే.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×