BigTV English

Chiranjeevi : వాళ్ల విమర్శలు బాధ కలిగించాయి.. పవన్‌పై చిరు భావోద్వేగం..

Chiranjeevi : వాళ్ల విమర్శలు బాధ కలిగించాయి.. పవన్‌పై చిరు భావోద్వేగం..

Chiranjeevi : మెగా ఫ్యామిలీ. ఈ పదంలో ఓ యూనిటీ కనిపిస్తుంది. ఆత్మీయఅనుబంధాలు దర్శనమిస్తాయి. ఆ కుటుంబ సభ్యుల మధ్య బంధం ఎంతో ధృడమైందో అనేక సందర్భాల్లో రుజువైంది. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్..అన్నయ్య చిరుపై ఈగ వాలనివ్వరు. మెగాస్టార్ తన సోదరులపై ఎంతో ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కుటుంబ సభ్యుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ గురించి చెప్పిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.


జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వస్తున్న విమర్శలు విని తానెంతో బాధపడ్డానని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న తన తమ్ముడిని కొంతమంది మితిమీరి విమర్శిస్తున్నారని ఆవేదన చెందారు. అవి విన్నప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉంటుందని అన్నారు.

ఇంకా చిరు ఏమన్నారంటే..
“పవన్‌ కు కుటుంబం అంటే ఎంతో ప్రేమ. నిస్వార్థపరుడు. డబ్బు, పదవులపై అతడికి వ్యామోహం లేదు. నిజం చెప్పాలంటే మొన్నటిదాకా పవన్‌కు సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ రంగంవైపు వచ్చాడు. ఇక్కడ కొంతమంది ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. వాటిని విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. పవన్‌ను విమర్శించిన వాళ్లతో నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది’’ అని చిరంజీవి చెప్పారు.


హ్యాపీ న్యూస్
పేరంట్స్ కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలు చెప్పారు. చరణ్‌, ఉపాసన తల్లిదండ్రులవుతున్నారనే వార్త తమ కుటుంబానికి అమితమైన ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ శుభవార్త కోసం ఆరేళ్ల నుంచి ఎదురుచూస్తున్నామని తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్‌ టూర్‌ పూర్తి చేసుకుని వచ్చాక శుభవార్త చెప్పడం కోసం వాళ్లిద్దరూ తన ఇంటికి వచ్చారన్నారు. ఉపాసన తల్లి కాబోతుందని విని తాను, సురేఖ ఆనందించామన్నారు. ఆనందబాష్పాలు వచ్చాయన్నారు. ఉపాసనకు మూడో నెల వచ్చాక ఈ విషయాన్ని అందరితో పంచుకున్నామని చిరు వివరించారు.

‘ఆచార్య’ తర్వాత చిరంజీవి నటించిన కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ కథానాయికగా నటించింది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ మూవీ నిర్మితమైంది. ఊరమాస్‌ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×