E-Paper
Advertisement

Vanitha Vijaykumar: తోడు కావాలి.. నాలుగో పెళ్ళికి రెడీ అయిన స్టార్ నటుడి కూతురు.. ?

Vanitha Vijaykumar: తోడు కావాలి.. నాలుగో పెళ్ళికి రెడీ అయిన స్టార్ నటుడి కూతురు.. ?
Advertisement

Vanitha Vijaykumar:కోలీవుడ్ నటుడు విజయ్ కుమార్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ నటుడే అయినా తెలుగు సినిమాల్లోనే ఆయన ఎక్కువ కనిపించారు. ఇక నటి మంజులను వివాహం చేసుకొని మరింత చేరువ అయ్యారు. విజయ్ కుమార్ కు నలుగురు ఆడపిల్లలు, ఒక మెగా పిల్లాడు. వీరందరూ కూడా ఇండస్ట్రీకి పరిచయం ఉన్నవారే. ప్రస్తుతం ఆడపిల్లలు పెళ్లి చేసుకొని, సెటిల్ అయ్యారు. కొడుకు అరుణ్ విజయ్.. తమిళ్ లో హీరోగా కొనసాగుతున్నాడు.

ఇక వీరివలన విజయ్ కుమార్ కు చెడ్డ పేరు రాలేదు కానీ, విజయ్ పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ మాత్రం నిత్యం సోషల్ మీడియాలో వివాదాలతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. పెళ్లిళ్లు, విడాకులు, కోర్టులు, కేసులు.. ఇలా ఒకటని చెప్పలేం. ఇక ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన వనితా.. తాజాగా నాలుగో పెళ్ళికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.

Advertisement

2000 లో ఆకాష్ అనే వ్యక్తిని వివాహమాడింది వనితా. వీరికి విజయ్‌ హరి, జోవిక అనే పిల్లలు ఉన్నారు. ఈ మధ్యనే జోవిక బిగ్ బాస్ తమిళ్ లో మెరిసింది. ఇక ఆకాష్ తో విభేదాలతో విడిపోయాక విజయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో జయనిత అనే కొడుకు ఉన్నాడు. ఇక ఆనంద్ తో విడిపోయాకా వనితా 2020లో పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుంది. అది కూడా ఎంతోకాలం నిలువలేదు. అతను కూడా ఆమెను విడిచి వెళ్ళిపోయాడు.

గత నాలుగేళ్లుగా ఆమె సింగిల్ గా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇక తాజాగా వనితా నాలుగో పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. ఒక ఇంటర్వ్యూలో ఆమె తోడు కావాలి.. సంతోషంగా జీవించాలి అనుకోవడంలో తప్పులేదుగా అని చెప్పుకొచ్చింది. దీనికి ఆజ్యం పోస్తూ  ఈ మధ్య తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక అభిమాని.. నాలుగో పెళ్లి చేసుకుంటున్నారా.. ? అని అడగ్గా.. మీరు ఊహించనిదానికి సిద్ధంగా ఉండండి అని చెప్పుకొచ్చింది. దీంతో కచ్చితంగా వనితా నాలుగో పెళ్ళికి రెడీ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి వనితా నాలుగో పెళ్లి చేసుకుంటుందా.. ? లేక ఏదైనా సినిమా గురించి చెప్తుందా అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×