E-Paper
Advertisement

Varalaxmi Sarathkumar: కాబోయే భర్తతో కలిసి వెళ్లి.. అల్లు అర్జున్ ను పెళ్ళికి ఆహ్వానించిన జయమ్మ

Varalaxmi Sarathkumar: కాబోయే భర్తతో కలిసి వెళ్లి.. అల్లు అర్జున్ ను పెళ్ళికి ఆహ్వానించిన జయమ్మ
Advertisement

Varalaxmi Sarathkumar: మరికొద్దిరోజుల్లో కోలీవుడ్ హీరోయిన్.. సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలు వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లిపీటలు ఎక్కనుంది. నికోలాయ్ సచ్ దేవ్‌ తో ఈ మధ్యనే ఆమె ఎంగేజ్ మెంట్ జరుపుకుంది. జూలై 2న గ్రాండ్‌గా‌ డిస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని, థాయ్‌లాండ్‌లో ఆమె వెడ్డింగ్‌ ప్లాన్స్‌ ఏర్పాట్టు భారీగా జరుగుతున్నాయట.

ఇప్పటివరకు పెళ్లి తేదీని బయటపెట్టని ఈ హీరోయిన్.. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అందరి సెలబ్రిటీలకు వెడ్డింగ్ కార్డ్స్ ను పంచుతుంది. ఇప్పటికే ఆ దేశంలో పెళ్లి పనులు కూడా ప్రారంభమైనట్టు సమాచారం. హల్దీ, మెహెందీ నుంచి అన్ని వేడుకలు థాయ్‌లాండ్‌లోనే జరగనున్నాయట.

Advertisement

ఇకపోతే ఈ మధ్యనే ఈ చిన్నది రజనీకాంత్, చంద్రబాబు నాయుడు, గోపిచంద్ మలినేని, బాలకృష్ణ, హరీష్ శంకర్, రవితేజ, సమంత, నయనతార తదితరులను కలిసి వివాహా ఆహ్వాన పత్రికను అందించింది. నిండుగా చీరకట్టుతో అందరి ఇంటికి వెళ్లి ఎంతో ప్రేమగా వారిని పెళ్లికి ఆహ్వానిస్తుంది. తాజాగా వరలక్ష్మీ.. అల్లు అర్జున్ ను కూడా పెళ్ళికి ఆహ్వానించింది.

కొద్దిసేపటి క్రితమే వరలక్ష్మీ తనకు కాబోయే భర్త నికోలాయ్ తో కలిసి అల్లు వారి ఇంటికి వెళ్ళింది. ఈ కొత్త జంటను అల్లు కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. ఇక అల్లు అరవింద్ కు, అల్లు అర్జున్ కు ఆమె వెడ్డింగ్ కార్డ్స్ అందజేసి.. పెళ్ళికి తప్పకుండ రావాలని కోరింది. అనంతరం బన్నీ.. నికోలాయ్ తో కొద్దిసేపు ముచ్చటించాడు. తప్పకుండా పెళ్ళికి వస్తామని అల్లు కుటుంబం వరూకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

క్రాక్ సినిమాతో వరలక్ష్మీ తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. జయమ్మగా మారిపోయింది. ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది పెళ్లి తరువాత కూడా నటించనున్నట్లు తెలిపింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×