BigTV English

Redmi 13 5G Launch Date: ఇది సూపర్.. రూ.11 వేలకే రెడ్‌మీ కొత్త ఫోన్.. జూలై 9న లాంచ్!

Redmi 13 5G Launch Date: ఇది సూపర్.. రూ.11 వేలకే రెడ్‌మీ కొత్త ఫోన్.. జూలై 9న లాంచ్!
Advertisement

Redmi 13 5G Launch Date: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi గత సంవత్సరం Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ఇప్పటికే 4 మిలియన్ యూనిట్ల సేల్ అయ్యాయని కంపెనీ తెలిపింది. ఇప్పుడు  కంపెనీ దాని సక్సెసర్‌గా Redmi 13 5G ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్ ఇండియాలోని మైక్రోసైట్‌లో మొబైల్ లైవ్ అవుతుంది. Redmi 13 5G జూలై 9,  మధ్యాహ్నం 12 లాంచ్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. పింక్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.


Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్, బ్యాక్‌ డిజైన్‌లో వస్తుంది ఇది టాప్‌లో IR బ్లాస్టర్, హెడ్‌ఫోన్ జాక్, కుడి వైపున పవర్, వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంది. USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ మైక్ ఇన్‌లెట్ సైడ్ ఉంటాయి. మైక్రోసైట్‌లో కొన్ని స్పెసిఫికేషన్‌లను కంపెనీ ధృవీకరించింది.

Also Read: లెజెండ్.. ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. లుక్ అదిరింది!


Redmi 13 5G స్పెసిఫికేషన్‌లు ఈ 5G ఫోన్‌లోని సెగ్మెంట్‌లో అతిపెద్ద డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఫోన్‌లో Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది Xiaomi HyperOSలో రన్ అవుతుంది. అలానే ఈ ఫోన్ 33W ఛార్జింగ్‌తో 5,030mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంటుంది.

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ క్రిస్టల్ గ్లాస్ డిజైన్ కలిగి ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడితే Redmi 13 రింగ్ LED ఫ్లాష్‌తో 108MP ప్రైమరీ కెమెరా సెటప్ చూడొచ్చు. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. Redmi 13 5G గురించి మరింత సమాచారం లాంచ్ సమయంలో తెలుస్తుంది.

Also Read: పిచ్చెక్కించే ఆఫర్స్.. రూ.1300కే వన్ ప్లస్ 5G ఫోన్లు.. ఇదేందీ బ్రో!

భారతదేశంలో Redmi 13 5G ధర గురించి ఇంకా Xiaomi నుండి ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. Redmi 12 5G  4GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ. 11,999, 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 12,499,  6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.14,999గా విడుదల చేసే అవకాశం ఉంది.

Related News

iPhone China Sales: ప్రపంచ దేశాల్లో ఫెయిల్ అయిన ఐఫోన్ మోడల్ .. చైనాలో మాత్రం సూపర్ హిట్.. ఎందుకంటే

Foldable Phone Comparison: పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ vs వివో X ఫోల్డ్ 5 vs గెలాక్సీ Z ఫోల్డ్ 7.. ప్రీమియం ఫోల్డెబుల్స్‌లో ఏది బెస్ట్?

Red Magic 11 Pro: 24GB ర్యామ్, 8000 mAh బ్యాటరీ.. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో అదిరిపోయే గేమింగ్ ఫోన్

Motorola new smartphone: 7000mAh భారీ బ్యాటరీ, 350MP కెమెరా.. మార్కెట్లో దుమ్మురేపుతున్న మోటో జీ75

M5 vs M4 MacBook Pro: M5 మ్యాక్ బుక్ ప్రో vs M4 మ్యాక్ బుక్ ప్రో.. ఆపిల్ రెండు ల్యాప్‌టాప్స్‌లో ఏది బెటర్?

Samsung Support End: గెలాక్సీ పాపులర్ మోడల్స్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ నిలిపివేసిన శామ్‌సంగ్.. మీ ఫోన్ కూడా ఉందా?

Motorola Discount: మోటోరోలా 7000mAh బ్యాటరీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. కేవలం రూ.7200కు లేటెస్ట్ మోడల్

Amazon Offers: 99 రూపాయలకే మొబైల్‌ ఫోన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అదిరే ఆఫర్

Big Stories

×