E-Paper
Advertisement

Varun Tej-Lavanya : కొణిదెల వారి పెళ్లి చాలా కాస్ట్లీ గురూ.. వివాహం ఖర్చు ఎంతో తెలుసా..?

Varun Tej-Lavanya : కొణిదెల వారి పెళ్లి చాలా  కాస్ట్లీ గురూ.. వివాహం ఖర్చు ఎంతో తెలుసా..?
Advertisement
Varun Tej-Lavanya

Varun Tej-Lavanya : ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని పెళ్లి బంధంలో ముడిపడ్డారు వరుణ్ ,లావణ్య త్రిపాఠి. కొన్ని సంవత్సరాలుగా గుట్టుగా ఉంచిన ప్రేమాయణాన్ని ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కించారు. గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో మెగా వారి పెళ్లి హడావిడి అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా వీళ్ళ పార్టీలకు సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.

పెళ్లికి మూడు రోజుల ముందే ఇటలీకి తరలి వెళ్ళిన మెగా ఫ్యామిలీ అక్కడ చేసిన సందడి ఫోటోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. ఇక వీటిని అభిమానులు ఫుల్ వైరల్ చేస్తున్నారు. కాక్ టెయిల్ పార్టీ దగ్గర నుంచి పెళ్లి వరకు మెగా వారి సందడి తో ఇటలీ మారు మోగింది. అయితే పాపం నాగబాబుకి ఖర్చు కూడా అదే రేంజ్ లో మోగింది అన్న విషయం పెళ్లి ఏర్పాట్లు చూస్తే తెలిసిపోతుంది. తన కొడుకు పెళ్లి కోసం మెగా బ్రదర్ నాగబాబు భారీగానే ఖర్చు చేసినట్లు టాక్.

Advertisement

తమ ప్రేమకు పునాది వేసిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలి అన్న వధూవరుల కోరిక మేరకు మెగా ఫ్యామిలీ వీరి పెళ్లిని ఇటలీలో అరేంజ్ చేశారు. ఇక నిన్న బుధవారం వేదమంత్రాల సాక్షిగా రాత్రి 7:18 నిమిషాలకు నిర్ణయించిన శుభ ముహూర్తంలో వీరిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. వీరిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం #VarunLav అంటూ బాగా వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లిలో డాన్స్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయ్యాయి.

ఇక ఫోటోలు చూసిన ఎవరికైనా పెళ్లిలో డెకరేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం ఎంత గ్రాండ్ గా రాయల్ లుక్ తో ప్లాన్ చేశారో అర్థం అవుతుంది. ఈ పెళ్లి కోసం నాగబాబు అచ్చంగా 10 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్లు టాక్. కొడుకు పెళ్లి అందరికీ బాగా గుర్తుండిపోయే విధంగా చేయాలి అని భావించిన నాగబాబు ఎక్కడ అసలు ఖర్చుకి వెనకాడనే లేదట. మెగా ఫ్యామిలీ ,అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, మిగిలిన సన్నిహితులు, స్నేహితులు అందరూ కలిసి మొత్తం ఈ పెళ్లికి 120 మంది హాజరయ్యారు. ఇక ఈ ఖర్చు కేవలం పెళ్లి వరకేనండోయ్.

Advertisement

ప్రస్తుతం ఇటలీలో పెళ్లి తర్వాత పార్టీ పూర్తి అయ్యాక మెగా వారు తిరిగి హైదరాబాదు చేరుకుంటారు. ఇక్కడి బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానుల కోసం నవంబర్ 5వ తారీఖున గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కాక రాజకీయ ప్రముఖులు కూడా ఈ రిసెప్షన్ కి తరలివస్తారు. మొత్తానికి 1000 మందికి పైగా అతిథులు ఈ రిసెప్షన్ లో సందడి చేస్తారు అని అంచనా. మరి దీనికి నాగబాబు ఎంత ఖర్చు పెడతాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×