E-Paper
Advertisement

BJP : ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్.. సీట్లు ఎవరికి దక్కాయంటే?

BJP :  ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్.. సీట్లు ఎవరికి దక్కాయంటే?
Advertisement

BJP : తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 35 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 52 మంది అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత రెండో లిస్ట్ లో ఒక్క పేరును మాత్రమే వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 88 మంది అభ్యర్థలను బీజేపీ ప్రకటించింది. ఇంకా 31 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్
ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌
బోధన్‌-వద్ది మోహన్‌రెడ్డి
బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్ రూరల్ – దినేష్ కులాచారి
మంథని-చందుపట్ల సునీల్ రెడ్డి
మెదక్- పంజా విజయ్ కుమార్
నారాయణ్ ఖేడ్- జన్వాడే సంగప్ప
అందోల్ – బాబూ మోహన్
జహీరా బాద్- రామ్ చంద్ర రాజ్ నర్సింహ
ఉప్పల్- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఎల్బీనగర్ -సామా రంగారెడ్డి
రాజేంద్రనగర్-తోకల శ్రీనివాస్ రెడ్డి
చెవెళ్ల- కేఎస్ రత్నం
పరిగి-బూనేటి మారుతి కిరణ్
ముషిరాబాద్- పూసరాజు
మలక్ పేట్- సాంరెడ్డి సురేందర్ రెడ్డి

Advertisement

అంబర్ పేట్- కృష్ణ యాదవ్
జూబ్లీహిల్స్- లంకల దీపక్ రెడ్డి
సనత్ నగర్-మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్-మేకల సారంగపాణి
నారాయణ్ పేట్- కే. రతంగ్ పాండురెడ్డి
జెడ్చర్ల- చిత్తరంజన్ దాస్
మక్తల్- జలందర్ రెడ్డి
వనపర్తి -అశ్వద్థామరెడ్డి
అచ్చంపేట్- దేవాని సతీశ్ మాదిగ
షాద్ నగర్- అందె బాబయ్య
దేవరకొండ- కేతావత్ లాలూ నాయక్
హుజురానగర్-చల్లా శ్రీలతారెడ్డి
నల్గొండ-మాదగాని శ్రీనివాస్ గౌడ్
అలేరు- పడాల శ్రీనివాస్
పరకాల- పి. కాళీ ప్రసాద్ రావు
పినపాక- పోడియం బాలరాజు
పాలేరు- నున్న రవికుమార్
సత్తుపల్లి- రామలింగశ్వరరావు

ఆందోల్ బీజేపీ టికెట్ పై గందరగోళం నెలకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయనని.. బాబూ మోహన్ ముందే ప్రకటించారు. అయినా ఆయనకు మూడో జాబితాలో టికెట్ కేటాయించారు. బాబూ మోహన్ కు టికెట్ రావడంతో.. కమలం కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఐతే ఆయన మనసు మార్చుకుంటారా? బరిలో ఉంటారా అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Advertisement

ఇక జనసేనతో బీజేపీ పొత్తుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. సీట్ల లెక్కపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. 32 స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. అయితే బీజేపీ 9 నుంచి 10 సీట్లు మాత్రమే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మూడో లిస్ట్‌లో కూకట్‌పల్లితో సహా ఉమ్మడి ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో ఈ సీట్లు జనసేనకు దక్కే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సెటిలర్లు, సరిహద్దు జిల్లాల్లో జనసేనకు టికెట్లు కేటాయించే అవకాశమే కనిపిస్తోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×