E-Paper
Advertisement

Varun Tej : తొలిప్రేమ’ టైటిల్ వాడినందుకే వణికాను.. ఇక చిరంజీవిగారి టైటిల్ వాడాలంటే?

Varun Tej : తొలిప్రేమ’ టైటిల్ వాడినందుకే వణికాను.. ఇక చిరంజీవిగారి టైటిల్ వాడాలంటే?
Advertisement

Varun Tej : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power star Pawan Kalyan) కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మొదలైన పవన్ కళ్యాణ్ కెరియర్ లో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు పడ్డాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ కూడా ఆ సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ వెర్షన్ కంటే కూడా ఖుషి (Khushi) సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ కూడా బాగా ఉంది. ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్ అలానే చాలా యాక్షన్ సీక్వెన్సెస్ పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన విధానం ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలిప్రేమ సినిమాకి ఉన్న స్థాయి వేరు స్థానం వేరు.

Also Read : Varun Tej: నేను కేవలం మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను, అంతకుమించి బ్రెయిన్ వాడను కూడా

Advertisement

కరుణాకర్ దర్శకుడుగా పరిచయమైన తొలిప్రేమ (Tholi Prema) సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను రీ రిలీస్ చేసినప్పుడు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అసలు తొలిప్రేమ సినిమా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ మనకు చాలా దగ్గర వ్యక్తిలా అనిపించడం. తెలుగు సినిమా హీరో అంటే నలుగురికి మంచి చేయాలి. మంచి ప్రయోజకుడిలా ఉండాలి, అనుకునే తరుణంలో ఒక మామూలు పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడో అలా చూపించాడు కరుణాకర్. పవన్ కళ్యాణ్ బాలు అనే పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తాడు. ఈ పాత్ర చాలామంది యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయింది. ఇది ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

Also Read : Matka Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా మట్కా ట్రైలర్ లాంఛ్.. వరుణ్ బ్లాక్ బస్టర్ పక్కా..!

Advertisement

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా తొలిప్రేమ. ఈ సినిమాతోనే వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ వెంకీ అట్లూరి దర్శకుడుగా పరిచయమైన సినిమాకి వాడడానికి పెద్ద సాహసం చేశారని చెప్పాలి. ఈ సినిమా కోసం ఆల్టర్నేట్ టైటిల్స్ కూడా ఆలోచించారు. అయితే సినిమా చూసినప్పుడు తొలిప్రేమ అనే టైటిల్ యాప్ట్ అనిపించింది. అందుకోసమే ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి టైటిల్ ని ఏమైనా యూస్ చేస్తారని అడిగినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు నటించిన తొలిప్రేమ టైటిల్ ని వాడాలంటేనే నేను చాలా వణికాను.. ఇక చిరంజీవిగారి టైటిల్ వాడాలంటే అంత సాహసం చేయలేను అని వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చాడు.

Related News

సర్కార్‌ అప్పీలుపై మొదటగా స్పందించిన నాగ్‌..! కరువు పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ నుంచి సహకారం కోరిన సీఎం రేవంత్‌ రెడ్డి..ఇండస్ట్రీ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటన ..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×