BigTV English

Matka Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా మట్కా ట్రైలర్ లాంఛ్.. వరుణ్ బ్లాక్ బస్టర్ పక్కా..!

Matka Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా మట్కా ట్రైలర్ లాంఛ్.. వరుణ్ బ్లాక్ బస్టర్ పక్కా..!

Matka Movie Trailer: మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej)ఒక్క బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన చిత్రం మట్కా (Matka). ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన.. ఈసారి మరో సరికొత్త కథతో రాబోతున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14వ తేదీన విడుదల కాబోతోంది.


మెగాస్టార్ చేతుల మీదుగా మట్కా ట్రైలర్ లాంచ్..

భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ విడుదల అవ్వగా, ఇప్పుడు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేతుల మీదుగా విడుదల చేయించడం గమనార్హం. 1960 బ్యాక్ డ్రాప్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, గ్యాంబ్లింగ్ కథాంశంతో మట్కా సినిమా రాబోతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary)హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. నోరా ఫతేహి , నవీన్ చంద్ర , సలోని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మట్కా సినిమా పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.


పులులు , సింహాలు ఆడించేవాడే వీడు..

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. “జనం సర్కస్ లో జోకర్ ను చూసి నవ్వుతారు. చప్పట్లు కొడతారు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకొని.. అదే సర్కస్ లో పులులను, సింహాలను ఆడించే వాడు కూడా ఒకడుంటాడు.. అలాంటోడే వీడు..రింగ్ మాస్టర్” అంటూ మాస్ ఎలివేషన్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైలర్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది ఇందులో వరుణ్ తేజ్ ‘వాసు’ అనే పవర్ఫుల్ పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ తేజ్ చాలా మాస్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. సూర్య (Suriya) కంగువ (Kanguva) సినిమాకు పోటీగా విడుదల కాబోతోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఈసారి వరుణ్ తేజ్ కి పక్కా బ్లాక్ బస్టర్ లభించినట్లే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా వివాహం తర్వాత రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి వరుణ్ తేజ్ కి ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.

పెళ్లి తర్వాత మొదటి సినిమా విడుదల..

ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya tripathi) ని దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించిన ఈయన గత ఏడాది పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం జరుపుకొని, నవంబర్ ఒకటవ తేదీన వివాహం చేసుకున్నారు. ఈ నవంబర్ 1కి అప్పుడే ఏడాది పూర్తి చేసుకున్న ఈ జంట గత మూడు రోజులుగా అమెరికాలో ఉంటూ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు కొండల్లో ఉదయించే సూర్యుడు ముద్దాడుతున్న వేళ చాలా రొమాంటిక్ గా తన భార్యకు యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేశారు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు వివాహం తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×