E-Paper
Advertisement

Varun Tej- Lavanya Reception : మెగా వారి రిసెప్షన్.. అద్భుతో అద్భుతః

Varun Tej- Lavanya Reception : మెగా వారి రిసెప్షన్.. అద్భుతో అద్భుతః
Advertisement

Varun Tej- Lavanya Reception : అక్టోబర్ 30న ఇటలీలో కాక్ టైల్ పార్టీతో మెగా వారి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ లు ఇటలీలో బాగా సందడి చేశారు. నవంబర్ 1 పెళ్లి పూర్తి కావడంతో శనివారం అందరూ తిరిగి హైదరాబాదు చేరుకున్నారు. ఇటలీలో పెళ్లి కుటుంబ సభ్యులు మరియు కొంతమంది బంధుజనం మధ్య జరిగిన విషయం తెలిసిందే. మెగా ఫామిలీ హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హల్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆరు సంవత్సరాల పాటు గుట్టుగా ఉంచిన ప్రేమాయణాన్ని ఏడూ అడుగుల బంధంతో ముడివేశారు వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి. మెగా ప్రిన్స్ రిసెప్షన్ వేడుకలు కూడా మెగా రేంజ్ లో నిర్వహిస్తున్నారు.

Advertisement

వరుడు వరుణ్ తేజ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ సూట్ ధరించగా.. వధువు గోల్డ్ కలర్ సీక్వెల్ సారీతో మెరిసిపోతుంది. వరుణ్ ఎంత ఎత్తు ఉంటాడో అందరికీ తెలిసిందే.. ఫిదా మూవీ లో ఐ బాబోయ్ ఎంత పొడుగో.. సాంగ్ వరుణ్ కోసమే రాసినట్లు ఉంటుంది. లావణ్య కూడా చక్కటి ఎత్తు.. ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ ఉండడంతో వరుణ్ పక్కన జోడిగా అద్భుతంగా సెట్ అయింది. రిసెప్షన్ వేదికపై ఈ జంట చూడముచ్చటగా ఉన్నారు.

2017 లో వచ్చిన మిస్టర్ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారి.. ఆరు సంవత్సరాల నిరీక్షణ తర్వాత నవంబర్ 1 న పెళ్లి బంధం లోకి ఎంటర్ అయింది. ఇక రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ అయితే.. పూలవనం మధ్య పొదరిల్లులా ఉంది. సడన్గా ఎంటర్ అయిన ఎవరికైనా చుట్టూ ఉన్న రెప్రెషన్ ఫ్లవర్స్ ని చూసి గార్డెన్ లోకి వచ్చామా అనిపిస్తుంది. ఈ రిసెప్షన్ ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

వాటితో పాటుగా మెగా.. అల్లు హీరోస్.. వారి కాస్ట్యూమ్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ వేడుకకు హాజరైన సెలబ్రిటీలు అందరూ బాగా సందడి చేశారు. చుట్టూ ఎటు చూసినా పచ్చదనం.. పూల సుగంధం.. మధ్యలో చిలకా గోరింకలా వరుణ్.. లావణ్య, కంటికి ఆహ్లాదంగా, మనసుకు ముచ్చటగా ఉన్నారు. ఇక ఈ మెగా ఈవెంట్ లో వచ్చిన అతిథులకు మర్యాదల దగ్గర నుంచి భోజనాల వరకు మెగా బ్రదర్స్ దగ్గర ఉండి ఏ లోటు లేకుండా చూసుకున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×