BigTV English

Delhi Air Quality : అమల్లోకి GRAP-స్టేజ్ IV.. ఢిల్లీలో మరింత క్షీణిస్తున్న గాలి నాణ్యత..

Delhi Air Quality : అమల్లోకి GRAP-స్టేజ్ IV.. ఢిల్లీలో మరింత క్షీణిస్తున్న గాలి నాణ్యత..

Delhi Air Quality : నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) అంతటా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-స్టేజ్ IVని తక్షణమే అమలులోకి తెచ్చినట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఆదివారం ప్రకటించింది. ఈ ప్రాంతంలో గాలి నాణ్యతలో కొనసాగుతున్న క్షీణతను ఎదుర్కోవడమే లక్ష్యమని పేర్కొంది.


స్టేజ్ I నుంచి III క్రింద ఇప్పటికే ఉన్న పరిమితులకు అదనంగా.. స్టేజ్ IV చర్యలు అమలు చేస్తామని ఎయిర్ క్వాలిటీ కమిషన్ పేర్కొంది. ఈ విషయాన్ని CAQM అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించే ప్రయత్నంలో సబ్-కమిటీ అన్ని చర్యలను అమలు చేయడానికి పిలుపునిచ్చిందని తెలిపింది. GRAP ‘సివియర్ +’ ఎయిర్ క్వాలిటీ (ఢిల్లీ AQI > 450) స్టేజ్-IV.. NCRలో తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇది GRAP స్టేజ్ 1, స్టేజ్ II, స్టేజ్ III కింద పేర్కొన్న నివారణ, నిర్బంధ చర్యలకు అదనం.

కాలుష్య స్థాయిలు పెరుగుతూనే ఉన్నందున, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ .. GRAP-4ని ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని సంబంధిత శాఖలతో సోమవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. GRAP స్టేజ్ IV కింద, ఇతర రాష్ట్రాల నుండి సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, BS VI వాహనాలు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. అత్యవసర సేవల్లో పాల్గొనే వారికి మాత్రమే మినహాయింపులు ఇవ్వడం జరుగుతుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×