E-Paper
Advertisement

Venkatesh: పిఠాపురం ఎమ్మెల్యే గారు.. పవన్ కు వెంకీ మామ అభినందనలు

Venkatesh: పిఠాపురం ఎమ్మెల్యే గారు.. పవన్ కు వెంకీ మామ అభినందనలు
Advertisement

Venkatesh: పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెల్సిందే. పదేళ్ల నుంచో పోరాడుతూ వస్తున్న పవన్ సాధించిన తొలివిజయం ఇది. దీంతో ఈ విజయాన్ని పవన్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. నిన్నటి నుంచి పవన్ కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు.. పవన్ సాధించిన ఈ ఘన విజయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

తాజాగా విక్టరీ వెంకటేష్ సైతం పవన్ కు అభినందనలు తెలిపారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ కూడా పాల్గొన్నాడు. తెలంగాణ ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేయగా.. ఆయనకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశాడు. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ లో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేయగా .. ఆయనకు కూడా వెంకీ మామ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశాడు.

Advertisement

ఇక వెంకీ మామ సపోర్ట్ చేసిన వీరిద్దరూ కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక పవన్ గెలుపుపై వెంకీ మామ ప్రత్యేకమైన పోస్ట్ పెట్టి ఆయనకు బెస్ట్ విషెస్ తెలిపాడు. ” డియర్ పవన కళ్యాణ్ చారిత్రాత్మక విజయం అందుకున్నందుకు అభినందనలు నా మిత్రమా నీ కంటే దీనికి ఎవరూ అర్హులు కాదు. మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి మరియు అంకితభావంతో స్ఫూర్తిని కొనసాగించండి. పిఠాపురం ఎమ్మెల్యే గారూ మీకు శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు.

పవన్- వెంకటేష్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరిద్దరూ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించారు. ఈ స్నేహ బంధింతోనే పవన్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో వెంకీ ఒక చిన్న పాత్రలో మెరిశాడు. ఇక ఈ ట్వీట్ చూడగానే పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారు అని వెంకీ మామ చనువుగా పిలవడంతో వీరిద్దరి బాండింగ్ ఎలాంటిదో అని గుర్తుచేసుకుంటున్నారు. ఏదిఏమైనా వెంకీ మామ మనసు వెన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×