BigTV English

CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను స్పెషల్ కోర్టు కొట్టివేసింది. అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది. ఈ మేరకు వైద్య పరీక్షలను తీహార్ జైలులోనే నిర్వహించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేయాలని పేర్కొంది.


జూన్ 19 వరకు కస్టడీ పొడగింపు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌.. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోర్టు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్లీ తీహారు జైలులో లొంగిపోయారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకోవాలని చేసిన మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ బరువులో తేడాలున్నాయని, ఆరోగ్య పరీక్షలు అవసరమని కోర్టు ముందు ఉంచారు. దీనికి కోర్టు.. తీహారు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 19 వరకు కస్టడీ పొడగిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోదియా తీహారు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.


Also Read: బీజేపీ కుటిల రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా, కాకపోతే..

Tags

Related News

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Big Stories

×