E-Paper
Advertisement

Venkatesh Daughter Marriage : ఘనంగా వెంకటేశ్ కూతురి పెళ్లి.. ఫొటోలు వైరల్

Venkatesh Daughter Marriage : ఘనంగా వెంకటేశ్ కూతురి పెళ్లి.. ఫొటోలు వైరల్
Advertisement

venkatesh daughter hayavahini marriage news

Venkatesh Daughter Hayavahini Marriage(Celebrity news today): టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) ఇంట పెళ్లి సందడి నెలకొంది. కూతురి పెళ్లితో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రెండో కుమార్తె హయవాహినికి విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారు నిషాంత్ తో ఘనంగా వివహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో.. రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక ఘనంగా జరిపించింది. శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దగ్గుబాటి వారి కుటుంబం. హయవాహిని – నిషాంత్ ల పెళ్లి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొత్తజంట చూడముచ్చటగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉందని నెటిజన్లు కామెంట్ల్ చేస్తున్నారు.

Advertisement

Also Read : ఓజీ న్యూ పోస్టర్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు..

ఇక.. గతేడాది అక్టోబర్ లో నిషాంత్ – హయవాహినిల నిశ్ఛితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, మహేశ్ బాబులతో పాటు రానా, నాగచైతన్యలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లిలో ఇండస్ట్రీ ప్రముఖులు పెద్దగా కనిపించలేదు. మెహందీ వేడుకల్లో మహేష్ భార్య నమ్రత, కూతురు సితార కాబోయే దంపతులతో కలిసి సందడి చేశారు. కాగా.. వెంకటేశ్ – నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయవాహిని, భావనతో పాటు కొడుకు అర్జున్ కూడా ఉన్నారు. పెద్దకూతురు ఆశ్రిత పెళ్లి 2019లో జరుగగా.. ఆమె విదేశాల్లో సెటిల్ అయింది.

Advertisement

వెంకటేశ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సంక్రాంతికి విడుదలైన సైంధవ్ నిరాశ మిగిల్చింది. థియేట్రికల్ రన్ కంటే.. ఓటీటీలో ఏ మాత్రం ఆదరణ పొందలేదు. సినిమా అంతా వయొలెన్స్ ఎక్కువగా ఉండటం, ఆసక్తిగా లేని కథ ప్రేక్షకులను బోర్ కొట్టించాయి. సంక్రాంతికి విడుదలైంది కాబట్టి కలెక్షన్లు ఫర్వాలేదనిపించాయి. మరి తర్వాతి సినిమాతో అయితే వెంకీ.. తనమార్క్ ను చూపించి మంచి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×