BigTV English

Venu Swamy: ప్రభాస్ డైలాగ్.. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో.. కమల్ హాసన్

Venu Swamy: ప్రభాస్ డైలాగ్.. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో.. కమల్ హాసన్


Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల ఆస్థాన జ్యోతిష్యుడుగా వేణుస్వామి కొనసాగుతున్నాడు. హీరోయిన్లకు సక్సెస్ కావాలి అంటే.. వేణుస్వామితో పూజ చేయించాల్సిందే. రష్మిక, పూజా హెగ్డే, అషురెడ్డి, డింపుల్ హయతి.. ఇలా హీరోయిన్స్ అందరూ తమా జాతకాల్లో ఉన్న దోషాలను పోగొట్టుకోవడానికి వేణుస్వామి చేత పూజలు జరిపించుకున్నవారే. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సెలబ్రిటీల జాతకాలను చెప్పడంలో సిద్దహస్తుడిలా మారిపోయాడు వేణుస్వామి. సమంత- నాగ చైతన్య విడిపోతారు అని ముందే చెప్పుకురావడం.. అది జరగడంతో ఆయన ఫేమస్ అయ్యాడు. ఈయన ఏది చెప్తే అది జరుగుతుంది అని నమ్మేవాళ్లు ఉన్నారు. ఈయన చెప్పేది అంతా సోది అని అనుకొనేవాళ్లు ఉన్నారు.

ఇక ఈ మధ్యనే ప్రభాస్ జాతకం బాగాలేదని చెప్పి ఫ్యాన్స్ ను భయపెట్టాడు. సలార్ హిట్ అయినా కూడా కలక్షన్స్ రాకపోవడంతో తాను చెప్పింది నిజమే అని, ప్రభాస్ జాతకంలో దోషాలు ఉన్నాయని, అతనికి పెళ్లి యోగం కూడా లేదని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. వేణుస్వామి తాజాగా భార్యతో కలిసి ఒక రీల్ చేయగా.. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ జాతకం బాగోలేదని చెప్పి.. డార్లింగ్ ఫ్యాన్స్ తో తిట్లు తిన్న వేణుస్వామి.. ప్రభాస్ చెప్పిన డైలాగ్ నే రీల్ చేయడంతో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. వేణుస్వామి భార్య వీణ కూడా తెలుగువారికి సుపరిచితమే. తెలుగు సాంగ్స్ ను వీణమీద వాయిస్తూ ఫేమస్ అయ్యింది. ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఆమె రీల్స్ చేస్తూ ఉంటుంది.


తాజాగా వీణ.. భర్త వేణుస్వామితో కలిసి.. మిర్చి సినిమాలోని ప్రభాస్- అనుష్క పెళ్లి టాపిక్ సీన్ ను రీక్రియేట్ చేసింది. పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఇలానే ఉండాలి అని ఏమైనా కోరికలు ఉన్నాయా అని వీణ అడగ్గా.. చదువుకున్న అమ్మాయి అయితే బావుంటుంది అని ప్రభాస్ చెప్పే డైలాగ్ ను వేణుస్వామి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అదికాక జ్యోతిష్యుడు అని చెప్పుకుంటూ.. అలాంటి డిజైనర్ డ్రెస్ లలో కనిపించడంతో కొంతమంది మండిపడుతున్నారు. ఇంకొంతమంది.. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో.. కమల్ హాసన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×