Veena Srivani: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ అయ్యాక.. వేణుస్వామి వారి జాతకం చెప్పుకొచ్చాడు. వారిద్దరూ విడిపోతారని, చైతన్యకు పిల్లలు పుట్టరని చెప్పుకొచ్చాడు. దీంతో వేణుస్వామిపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. నెటిజన్స్ మాత్రమే కాకుండా వేణుస్వామి మీద తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్.. తెలంగాణ ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పాటు జర్నలిస్టులు.. మా అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేశారు.
ఇక మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.. వేణుస్వామికి పర్సనల్ గా కాల్ చేసి ఇలాంటివి మానేయమని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వేణుస్వామి ఒక వీడియోను రిలీజ్ చేస్తూ.. చైతన్య- సమంత జాతకానికి కంటిన్యూగా చై – శోభితా జాతకం చెప్పాల్సి వచ్చిందని, ఇకనుంచి సెలబ్రిటీల జాతకాలు కూడా చెప్పడం మానేస్తానని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. తాజాగా భర్తపై జరుగుతున్న ట్రోలింగ్ పై వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి స్పందించింది. అందరు తన భర్తదే తప్పు అని అంటుంటే.. మీడియా వలనే ఇదంతా జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక ఈ వీడియోలో వీణా మాట్లాడుతూ.. ” నేను జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నా.. నాతో పనిచేసిన నా కొలీగ్స్ నాకో వీడియో పంపించారు. ప్రముఖ జ్యోతిష్కుడు పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఉంది. నేను జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నా. వారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. వారు అడుగుటఁటే ఇంటరాగేషన్ చేసినట్లు ఉంటుంది. మీడియా అయితే మరీ దారుణం. అంతెందుకు రాజ్ తరుణ్ – లావణ్య ను మీడియా ఛానెల్ స్ ఏం చేసాయి. వారి పర్సనల్ మాటలను కనీసం బీప్ కూడా లేకుండా ఆమె పడుకుంది.. ఈమె పడుకుంది అని బూతులు టెలికాస్ట్ చేస్తున్నారు.
ఇదేనా జర్నలిజం అంటే. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే కచ్చితంగా జర్నలిజం చేయాల్సివచ్చేది. కానీ, ఇప్పుడు రెండు మూడు ఇంటర్వ్యూ చేసి జర్నలిస్ట్ అని చెప్పుకొస్తున్నారు. సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగిస్తుంది ఎవరు. ? మీడియా కాదా.. ? ఎయిర్ పోర్ట్ దగ్గరనుంచి ఇంటివరకు ఎక్కడా వదలకుండా వాళ్ల బైట్స్ కోసం నిద్రాహారాలు మాని వెయిట్ చేస్తున్నారు. ఎందుకు.. ఎందుకు మీడియా అంత దిగజారాలి. పొద్దున మంచు విష్ణు కాల్ చేసి చాలా పద్దతిగా మాట్లాడారు.
నేను ఆయనను ఒకటే అడుగుతున్నా.. ఎన్నో కుటుంబాలు కష్టపడి సినిమా తీస్తే ఒక్క రివ్యూతో ఆ కష్టాన్ని మొత్తం నాశనం చేస్తున్న రివ్యూయర్స్ ను ఏం చేస్తారు. మీడియా అంటే ఇదా.. ఇంత దరిద్రమా.. తమను తాము కాపాడుకోవడానికి ఆ పంతులు ఇది చెప్పాడు.. వాడు ఇలా అన్నాడు అని మాట్లాడుతున్నారు. ఎలా అలంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టరా.. ఒక హీరో కొడుకు గురించి మాట్లాడితేనే కేసులు పెట్టాలా.. ? మరి ప్రజల సమస్య మాటేమిటి.. ? వాటి గురించి ఈ మీడియా ఏం చెప్తుంది. యూత్ మారండి” అంటూ హితబోధ చేసుకొచ్చింది. అసలు మీ ఆయనమీద కేసు పెట్టింది ఎందుకు.. ? ముందు ఆయన జాతకాలను చెప్పమనడం ఆపమను. ఎవరు సెలబ్రిటీల జాతకాలను పబ్లిక్ గా చెప్పమ్మన్నది. వారు అడిగారా.. ? వారి పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు.. ? ఈ సోదంతా మీ ఆయనకు చెప్పు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.