 
					Telangana Politics: తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, అజార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
శుక్రవారంగా తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జన్మించిన అజారుద్దీన్, అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో చదివారు. ఆ తర్వాత నిజాం కాలేజీలో బీకాం చదివారు.
మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తితో క్రికెట్ వైపు అడుగులు వేసిన ఆయన, 1984లో టీమిండియాలోకి అడుగుపెట్టారు. 90 వ దశకంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆటకు గుడ్ బై చెప్పేసిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు
2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్ నియోజకవర్గం ఎంపీగా గెలుపొందారు. 2018 లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆయనకు మైనార్టీశాఖను కేటాయించే అవకాశమున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: ప్రత్యర్థులకు మంత్రి అజారుద్దీన్ స్ట్రాంగ్ కౌంటర్
అజారుద్దీన్‌ను రేవంత్ కేబినెట్‌లోకి తీసుకోవడంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. వాటిని పార్టీ హైకమాండ్ ఏ మాత్రం పట్టించుకోలేదు. కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూసింది. చివరకు తెలంగాణ ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
రాజ్ భవన్ లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం
అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
అజారుద్దీన్ కి శుభాకాంక్షలు తెలియచేసిన సీఎం రేవంత్ రెడ్డి
పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు pic.twitter.com/9IACPTKIbk
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025