BigTV English
Advertisement

Bigg Boss: ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

Bigg Boss: ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

Bigg Boss:కార్తీక మాసం రావడంతో చాలామంది సెలెబ్రిటీలు పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా నారా రోహిత్ (Nara Rohit) తాను ప్రేమించిన హీరోయిన్ శిరీష లేళ్లతో పెళ్లి పీటలెక్కిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తాను ప్రేమించిన హరిణ్య రెడ్డితో పెళ్లి పీటలెక్కబోతున్నారు. వీరి పెళ్లి మరికొద్ది రోజుల్లో జరగబోతుంది.అయితే తాజాగా మరో సెలబ్రిటీ కూడా పెళ్లికి రెడీ అయ్యారు.


ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం..

ఆయన ఎవరంటే ఆర్జే.సూర్య.. ఆర్జే గా కెరియర్ మొదలుపెట్టి మిమిక్రీ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తాజాగా బుల్లితెర నటి సుధీర చెల్లెలు అయినటువంటి ఆర్జె శౌర్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. పలువురు హీరోల గొంతులను మిమిక్రీ చేస్తూ టాలీవుడ్ లో రాణిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే సూర్య తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ లో సీజన్ 6 లో 8 వారాల పాటు తన ఆట తీరుతో రాణించారు. అలాంటి ఆర్జే సూర్య తాజాగా బుల్లితెర నటి సుధీర చెల్లెలు అయినటువంటి ఆర్జే శౌర్యతో ప్రేమలో పడి ఫైనల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

వధువు ఎవరంటే?

వీరి ఎంగేజ్మెంట్ వేడుక గురువారం రోజు గ్రాండ్ గా జరిగింది. ఇక ఆర్జే గా వర్క్ చేసిన సమయంలోనే శౌర్యతో సూర్య ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. అలా ఆర్జే సూర్య, ఆర్జే శౌర్య ఇద్దరు పెళ్లికి రెడీ అయిపోయారు. వీరి ఎంగేజ్మెంట్ వేడుకకి కొంతమంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. అందులో సీరియల్స్ చేస్తూ రాణిస్తున్న బుల్లితెర నటి సుష్మా కిరణ్ తో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు వీరి ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేశారు. ఇక ఆర్జే శౌర్య సిస్టర్ సుధీర గతంలో మాటీవీలో ప్రసారమైన కథలో రాజకుమారి సీరియల్ ద్వారా పేరు తెచ్చుకుంది. అలా ఫైనల్ గా ఎంగేజ్మెంట్ తో ఆర్జే సూర్య, ఆర్జే శౌర్య ఇద్దరు ఒక్కటయ్యారు. ఈ ఏడాది ఆఖరిలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.


also read:Adivi Shesh : అడివి శేష్ సినిమా ప్రమోషన్స్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్… పోస్ట్ వైరల్

ఆర్జే సూర్య బ్యాక్ గ్రౌండ్..

ఆర్జే సూర్య బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే..నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన సూర్య కనీసం చదువుకోడానికి డబ్బులు కూడా లేక ఓ పాన్ షాప్ లో సోడా సీసాలు క్లీన్ చేసి రోజుకు పది రూపాయల జీతాన్ని తీసుకునేవాడు. ఆయన తల్లి రోజు బీడీలు చుడుతూ ఉంటే.. తండ్రి తాపీ పని చేసేవాడు. అలా ఒక్కరోజు తండ్రి పని మానేస్తే ఇంట్లో గడవని పరిస్థితి ఉండేది. అలాంటి నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆర్జే సూర్య ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆర్జే సూర్య గతంలో ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలోనే ఆర్జేగా ఆఫర్ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్జేగా రాణించి తన కెరీర్ ని మలుపు తిప్పుకున్నారు. అలా మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 6లో కూడా అవకాశం అందుకున్నారు. బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఆర్జే సూర్య మరింత ఫేమస్ అయ్యారు.. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత మాటీవీలో ప్రసారమైన బిబి జోడిలో కూడా పటాస్ ఫైమాతో కలిసి బిబి జోడి సీజన్ 1 లో పాల్గొని ఆ సీజన్ విన్నర్ గా నిలిచాడు.

Related News

Bigg Boss Telugu 9: సర్‌ప్రైజ్‌.. బిగ్‌ బాస్‌ షోలోకి రష్మిక మందన్నా!

Bigg Boss : బిగ్‌బాస్‌ తనూజపై మాజీ కంటెస్టెంట్స్‌ యష్మీ, శ్రీసత్య ట్రోలింగ్‌.. వీడియో వైరల్‌!

Bigg Boss 9 Promo: ఏంటమ్మా ఆడడానికి రాలేదా.. మాధురికి ఇమ్ము పనిష్మెంట్.. షేమ్ లెస్!

Bigg Boss season 9 Day 53 : హౌస్ లో చపాతి పంచాయితీ, భరణి ను నిలబెట్టిన బంధం, పవన్ ను రిజెక్ట్ చేసిన శ్రీజ

Bigg Boss srija : బిగ్బాస్ మాస్టర్ ప్లాన్, ఆడియన్స్ కోరిక మేరకు ఆమెను ఇలా తీసుకొచ్చి అలా పంపించేసాడు

Bigg Boss 9 Ramya: హౌజ్‌లో డయోరియా, స్కిన్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డా.. అవేవి చూపించలేదు

Bigg Boss 9 promo: శ్రీజ వర్సెస్‌ భరణి.. రైట్‌ కలర్‌.. రైట్‌ పోజిషన్, ఈ పోరులో గెలిచిందేవరంటే!

Big Stories

×