 
					Rain Alert: మొంథా తుఫాన్ తీరాన్ని దాటింది. కానీ తన బీభత్సాన్ని మాత్రం ఆపలేదు. ఇప్పటికే ఏపీలో తన ప్రతాపాన్ని చూపిన మొంథా.. ఇప్పుడు తెలంగాణపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తెలంగాణలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది. రైతులు, లోతట్టు ప్రాంతాల వారు భారీగా నష్టపోయారు. వాగులు, వంకలు దాటే మార్గంలో చాలా మంది మరణించారు. అంతేకాకుండా భారీగా పంట నష్ట్రం కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మళ్లీ బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖా అధికారులు హెచ్చరిస్తున్నారు. నవంబరు నెలలో తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ బీభత్సం సృష్టిస్తుందని చెబుతున్నారు.
తెలంగాణలో మరో నాలుగు రోజులు కుండపోత వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాగల 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Also Read: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
ఏపీలో వాతావరణం ఇలా..
మొంథా తుఫాన్ ఏపీని ముంచేసింది. కానీ, దీనితో అగలేదు.. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. తీరం దాటిన తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే మత్స్య కారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్!
నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే సూచన
అల్పపీడన ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం
అక్టోబర్, నవంబరు నెలల్లోనే తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ బీభత్సం pic.twitter.com/YCT1vWTbg3
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025