 
					Bank Holidays Nov 2025 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. 2025 నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులు మూసివేస్తారు. తెలంగాణ (హైదరాబాద్ సహా)లో ఒక అదనపు సెలవు ఉంటుంది. కానీ ఏపీలో బ్యాంకులకు ఈ నెల రెగ్యులర్ సెలవులు మాత్రమే ఉన్నాయి. ఈ సెలవుల సమయంలో బ్యాంకింగ్ పనులు ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా చేసుకోవచ్చు. ఇంతకీ నవంబర్ నెలలో ఏపీ, తెలంగాణలో బ్యాంక్ సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ / హైదరాబాద్ బ్యాంకు సెలవులు (మొత్తం 8 రోజులు):
నవంబర్- 2- ఆదివారం (సెలవు)
నవంబర్- 5 – బుధవారం- గురు నానక్ జయంతి
నవంబర్ 8 – శనివారం- రెండవ శనివారం
నవంబర్ 9 – ఆదివారం(సెలవు)
నవంబర్ 16- ఆదివారం(సెలవు)
నవంబర్ 22 -శనివారం నాల్గవ శనివారం
నవంబర్ 23 – ఆదివారం (సెలవు)
నవంబర్ 30- ఆదివారం(సెలవు)
గమనిక: నవంబర్ 5న గురు నానక్ జయంతి సిక్కు సముదాయ పండుగ. తెలంగాణలో బ్యాంకులు పూర్తిగా మూసివేస్తారు.
ఏపీలో బ్యాంకు సెలవులు (మొత్తం 7 రోజులు):
నవంబర్ 2- ఆదివారం(సెలవు)
నవంబర్ 8 – శనివారం- రెండవ శనివారం
నవంబర్ 9 – ఆదివారం(సెలవు)
నవంబర్ 22 -శనివారం నాల్గవ శనివారం
నవంబర్ 23 – ఆదివారం (సెలవు)
నవంబర్ 30- ఆదివారం(సెలవు)
గమనిక: ఏపీలో నవంబర్ 1 (శనివారం) రాష్ట్ర అవతరణ దినోత్సవం అయినప్పటికీ.. ఇది బ్యాంకు సెలవు కాదు. నవంబర్ 5 కూడా బ్యాంకులకు సెలవు లేదు.
సలహాలు:
చెక్ చేయండి: మీ బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్‌సైట్ (RBI, SBI, HDFC మొదలైనవి)లో తాజా సమాచారం చెక్ చేయండి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అదనపు సెలవులు ఉండే అవకాశం కూడా ఉంటుంది.
ఆన్‌లైన్ బ్యాంకింగ్: UPI, నెట్ బ్యాంకింగ్, యాప్‌లు 24/7 పని చేస్తాయి.
ATM: సెలవుల సమయంలో కూడా క్యాష్ డిస్పెన్సర్లు పని చేస్తాయి.