 
					Sambarala Yeti Gattu: మెగామేనల్లుడు సాయి దుర్గ తేజ్ విరూపాక్ష లాంటి భారీ హిట్ తర్వాత నటిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటిస్తుండగా సాయికుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా కోసం తేజ్ చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే బాడీ పెంచి మరింత వైల్డ్ గా కనిపించాడు. అన్ని బావుండి ఉంటే ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అయ్యి ఉండేది. కానీ కొన్ని కారణాల వలన SYG వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమా బడ్జెట్ సమస్యలను ఎదుర్కొంటుందని, రూ 100 కోట్లకు పైగా పెట్టిన బడ్జెట్ సగం సినిమాకే అయిపోవడంతో మేకర్స్ చేతులెత్తేసారని పుకార్లు కూడా వచ్చాయి. అంతేకాకుండా బడ్జెట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందని కూడా మాట్లాడుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆ పుకార్లను ఖండిస్తూ మేకర్స్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ మొదలైందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ మధ్యనే తేజ్ బర్త్ డేకి స్పెషల్ వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా ఆగిపోలేదని కన్ఫర్మ్ అయ్యింది.
కులాల కొట్లాటల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ లో అది క్లియర్ గా చూపించారు. ఇక వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే గత రెండు రోజుల నుంచి మరోసారి SYG ఆగినట్లు రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తేజ్.. ఈ సినిమాను పక్కన పెట్టి రిపబ్లిక్ 2 మీద ఫోకస్ చేస్తున్నాడు అని, నిర్మాతలు సైతం తేజ్ తో మాట్లాడడం లేదని కూడాచెప్పుకొస్తున్నారు.
ఇక తేజ్ టీమ్ ఈ వార్తలను మరోసారి ఖండించింది. తేజ్ ఎలాంటి కొత్త సినిమా చేయడం లేదని స్పష్టం చేసింది. ” ప్రస్తుతం తేజ్ ఫోకస్ అంతా SYG మీదనే ఉంది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్లు తేజ్ రిపబ్లిక్ 2 సినిమాను ఓకే చేయలేదు. అలాంటి న్యూస్ ఏదైనా ఉంటే మేమే అభిమానులకు చెప్తాము, దయచేసి ఇలాంటి పుకార్లు నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో SYG ఆగలేదని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ సినిమాతో తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.