Naga Chaitanya – Shobhita.. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు స్వామి (Venu Swamy) . సెలబ్రిటీల జాతకాలపై జ్యోతిష్యం చెబుతూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ ఈయనతో రాజశ్యామల యాగం చేయించుకొని మరీ స్టార్ స్టేటస్ ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) ను మొదలుకొని యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal)వరకు చాలామంది ఈయనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చైతూ – సమంత విషయంలో వేణు స్వామి చెప్పినట్టే జరిగింది..
ఇకపోతే ఈయన చెప్పిన జాతకాలు దాదాపు సగానికి పైగా నిజం అయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha ) విడిపోతారని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచి వెలుగులోకి వచ్చారు. ఇక ఈయన చెప్పినట్టుగానే సమంత – నాగచైతన్య నాలుగేళ్లకే విడిపోవడంతో వేణు స్వామి కూడా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక అప్పటినుంచి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్న ఈయన ఇటీవల నాగచైతన్య – శోభిత ధూళిపాళ(Shobhita dhulipala) పెళ్లిపై కూడా ఊహించని కామెంట్లు చేశారు.
నాగచైతన్య – శోభిత జంట పై వేణుస్వామి హాట్ బాంబ్..
నాగచైతన్య – శోభిత ధూళిపాళ జాతకం ప్రకారం.. వివాహం చేసుకుంటే వీరి వివాహం బంధం ఎక్కువ కాలం ఉండదని, 2027లో వీరిద్దరు విడిపోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో చాలామంది ఈయనపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు అక్కినేని అభిమానులు ఈయనపై కేసు కూడా ఫైల్ చేయించినట్లు వార్తలు వినిపించాయి. దీనికి తోడు మరోవైపు నాగచైతన్య – శోభిత పెళ్లి డిసెంబర్ 4వ తేదీన జరగబోతోంది అంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే శోభిత ధూళిపాల ఇంట్లో పెళ్ళికి ముందు జరిగే గోధుమ రాయి, పసుపు దంచడం వంటి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈ ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేసింది కూడా.దీంతో పెళ్లి వార్తలకు జోరు అందుకుంది.
పునరాలోచనలో పడ్డ నాగార్జున..
గత కొన్ని రోజులుగా రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాదులోనే అన్నపూర్ణ స్టూడియోలోనే భారీ సెట్ వేసి వీరి వివాహం చేయడానికి నాగార్జున (Nagarjuna) అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెర పైకి వచ్చింది. ముఖ్యంగా నాగచైతన్య – శోభిత ధూళిపాళ పెళ్లి ఆగిపోతోంది అంటూ ఒక వార్త సంచలనం సృష్టించింది. నాగచైతన్య – శోభిత వివాహం చేసుకుంటే 2027లో విడిపోతారని వేణు స్వామి చెప్పారు. ఇప్పుడు పెళ్లి ముహూర్తం ఖరారు చేయించాలని, ఇద్దరి జాతకాలతో నాగార్జున పండితుల దగ్గరకు వెళ్లారని..వారు కూడా ఇదే చెప్పారట. అందుకే వీరిద్దరి పెళ్లి విషయంలో నాగార్జున పునరాలోచన చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.
నిజమెంత..?
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగచైతన్య అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య జాతకాన్ని పూర్తిగా పరిశీలించి ఏదైనా దోషం ఉంటే జాతక పరిహారం చేయించాలని కోరుతున్నారు మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.