Indian Railways: మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ట్రాఫిక్ ను నియంత్రించి అంబులెన్సులు ఎక్కడా ఆగకుండా వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడం చూశాం. కానీ, తొలిసారి ఓ పెళ్లి కోసం రైల్వే అధికారులు ఇతర రైళ్లను ఆపడం ఆశ్చర్యం కలిగించింది. రైలు ఆలస్యం అవడం వల్ల ఓ వరుడు తన పెళ్లి అనుకున్న సమయానికి జరగదేమోనని భయపడ్డాడు. ఈ విషయాన్ని రైల్వే అధికారులకు సోషల్ మీడియా వేదిగా వెల్లడించారు. వెంటనే రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనెక్టింగ్ రైలును నిలిపివేసి, ఆలస్యంగా నడుస్తున్న రైలును ఫాస్ట్ గా ముందుకు వెళ్లేలా చేశారు. అనుకున్న సమయానికి పెళ్లి వేదికకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. రైల్వే అధికారులకు పెళ్లి కొడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రైలు మూడు గంటలు ఆలస్యం
ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ ఈ నెల 15న పెళ్లి. గౌహతిలో వివాహ వేడుక జరగాల్సి ఉంది. అనుకున్నట్లుగానే, CST స్టేషన్ లో తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో కలిస గీతాంజలి ఎక్స్ ప్రెస్ ఎక్కారు. షెడ్యూల్ ప్రకారం రైలు 1:05 గంటలకు హౌరాకు చేరుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి సరైఘాట్ రైలును ఎక్కాలని భావించారు. కానీ, గీతాంజలి ఎక్స్ ప్రెస్ మూడు గంటలు ఆలస్యం అయ్యింది. కచ్చితంగా కనెక్టింగ్ రైలును మిస్ అవుతామని భావించారు. వెంటనే చంద్రశేఖర్ తన పెళ్లిని మిస్ అవుతానని ఆందోళన పడ్డాడు. వెంటనే ఈ విషయాన్ని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు రైల్వే ఉన్నతాధికారులకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
@RailMinIndia @AshwiniVaishnaw @nerailwaygkp @EasternRailway Need urgent help, we are group of 35 people, travelling via Gitanjali express for my marriage which is delayed by 3.5 hrs, Need to catch Sarighat express at 4:00 pm which seems difficult. Kindly help. My no. 9029597736 pic.twitter.com/a3ULEXHJfs
— Chandu (@chanduwagh21) November 15, 2024
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తూర్పు రైల్వే అధికారు
ఈ ట్వీట్ చూసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.. చంద్ర శేఖర్ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని తూర్పు రైల్వే అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యాయి. గీతాంజలి ఎక్స్ ప్రెస్ వచ్చే వరకు సరైఘాట్ ఎక్స్ ప్రెస్ హౌరా జంక్షన్ లో కాసేపు నిలిపారు. గీతాంజలి ఎక్స్ ప్రెస్ లోని లోకో పైలట్ కు రైలును వేగంగా నడిపించాలని ఆవేశించారు. ఈ మార్గంలో ఎటువంటి స్టాపేజ్ లు లేకుండా రైలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, స్టేషన్ లోని అధికారులు వరుడికి సంబంధించిన లగేజీని ప్లాట్ ఫాం 21 నుంచి సరైఘాట్ ఎక్స్ ప్రెస్ ఉన్న ప్లాట్ ఫారమ్ 9కి తీసుకెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే అధికారుల ప్రత్యేక ఏర్పాట్లతో గీతాంజలి ఎక్స్ ప్రెస్ అనుకున్న సమయానికి హౌరా జంక్షన్ కు చేరుకుంది. వెంటనే రైల్వే సిబ్బంది వరుడి లగేజీని సరైఘాట్ ఎక్స్ ప్రెస్ లోకి తీసుకెళ్లారు. అనుకున్న సమయానికి వివాహ వేదిక దగ్గరికి చేరుకున్నారు.
I would like to thank @RailMinIndia @RailwaySeva @nerailwaygkp @drmhowrah @AshwiniVaishnaw for making all the necessary arrangements so that I along with my 35 relatives could catch my connecting train. Thank you soo much. Special mention to @srdomkgp @CCMeasternrailway.
— Chandu (@chanduwagh21) November 15, 2024
రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిన చంద్రశేఖర్
రైల్వే అధికారుల ప్రత్యేక ఏర్పాట్లతో తన పెళ్లి అనుకున్న సమయానికి అయ్యిందని చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన పెళ్లి మిస్ కాకుండా ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “ఇది కేవలం సేవ మాత్రమే కాదు. దయతో కూడిన స్పందన. రైల్వే అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే నా పెళ్లి సరైన సమయానికి జరిగింది. భారతీయ రైల్వే సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని చెప్పారు.