E-Paper
Advertisement

Vettaiyan Prevue: ఎన్ కౌంటర్ చేయడం హీరోయిజమా.. రజినీ- అమితాబ్ ల మధ్య యుద్ధం వేరే లెవెల్

Vettaiyan Prevue: ఎన్ కౌంటర్ చేయడం హీరోయిజమా.. రజినీ- అమితాబ్ ల మధ్య యుద్ధం వేరే లెవెల్
Advertisement

Vettaiyan Prevue:   సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రాల్లో వెట్టయాన్ ఒకటి. టీజ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, GM సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ లాంటి స్టార్స్ అందరూ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  మనసిలాయో సాంగ్  రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా   ఈ సినిమా నుంచి   ప్రివ్యూను రిలీజ్ చేశారు.

Advertisement

హంటర్ ఎంట్రీ అంటూ రిలీజైన ఈ ప్రివ్యూ అదిరిపోయింది. అమితాబ్ బచ్చన్ ఇందులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ ల గురించి అడగడం.. రితికా సింగ్ , రజినీ గురించి ఎలివేషన్ ఇవ్వడం నెక్స్ట్ లెవెల్. ” ఈ దేశంలో లక్షలాది పోలీసులు  ఉన్నారు.. కానీ వీళ్ళను మాత్రమే చూడగానే గుర్తుపడుతున్నారు.. ఎందుకు” అని అమితాబ్ అడగ్గా.. రితికా.. ” మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ను భయపడకుండా ఎన్ కౌంటర్ చేసినందువల్ల వీళ్ళు హీరోస్ అయ్యారు” అని చెప్పడంతోనే  రజినీ ఎంట్రీ అదిరిపోయింది. 

ఎస్పీ  గా రజినీ కనిపించాడు.  ఇక  ఎన్ కౌంటర్ చేయడం హీరోయిజమా అన్న అమితాబ్ ప్రశ్నకు.. రజినీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు చూపించారు.. ” ఎన్ కౌంటర్ అనేది నేరం చేసిన వాళ్లకు విధించే శిక్ష మాత్రమే కాదు. ఇక మీదట ఇలాంటి నేరాలు జరగకుండా తీసుకొనే ముందు జాగ్రత్త చర్య” అని  చెప్పడంతోనే రజినీ- అమితాబ్ ల మధ్య యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక వీరిద్దరి మధ్య  ఫైట్  సీక్వెన్స్  ఉంటే కనుక థియేటర్  దద్దరిల్లడం  ఖాయం అనే చెప్పాలి.  ఇక  కేవలం సూపర్ స్టార్ ఎంట్రీ కావడంతో ఇందులో మిగతా పాత్రలను జస్ట్ అలా చూపించి వదిలారు.  ప్రస్తుతం ఈ  ప్రివ్యూ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో రజినీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.  

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×