E-Paper
Advertisement

Vettaiyan The Hunter: మనసిలాయో.. అనిరుధ్ ఎందుకు మేమంటే అంత పగ

Vettaiyan The Hunter: మనసిలాయో.. అనిరుధ్ ఎందుకు మేమంటే అంత పగ
Advertisement

Vettaiyan The Hunter: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.  అందులో ఒకటి వెట్టయన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై  సుభాస్కరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్,  ఫస్ట్ గ్లింప్స్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ  చేసిన మేకర్స్  వెట్టయన్ నుంచి మొదటి లిరికల్  సాంగ్ ను రిలీజ్ చేశారు. మనసిలాయో అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Advertisement

అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు శ్రీనివాస మౌళి లిరిక్స్ అందించగా..నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్ అద్భుతంగా ఆలపించారు. ఈ సాంగ్ మొత్తం జాతరలో జరుగుత్న్నట్లు కనిపిస్తుంది. వెట్టయన్ గొప్పతనాన్ని, క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చారు. మంజు వారియర్ డ్యాన్స్, రజినీ స్టైల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. 

ఇక ఎప్పటిలానే అనిరుధ్.. మ్యూజిక్ తో అదరగొట్టాడు. రజినీ మాస్ సాంగ్స్ లిస్ట్ లో మనసిలాయో కూడా చేరిపోయింది. రజినీ అనగానే  అనిరుధ్  కు మ్యూజిక్ కాదు  పూనకాలు వస్తాయేమో. తెలుగులో  దేవర  సినిమాకు సంగీతం అందించింది అనిరుధ్ నే. అసలు ఇలాంటి సాంగ్ ఎన్టీఆర్ కు పడితే.. ఆ మాస్ మ్యూజిక్ కు ఎన్టీఆర్ ఊర  మాస్ స్టెప్స్ వేస్తె.. థియేటర్ లో ఒక్క ప్రేక్షకుడు అయినా కూర్చోగలడా.. ?.   ఈ పాట విన్న తెలుగు ఫ్యాన్స్.. ఇదే విషయాన్నీ చెప్పుకొస్తున్నారు.

Advertisement

మావరకు వచ్చేసరికి కాపీ ట్యూన్స్ ఇచ్చి.. రజినీకి మాత్రం ఇలాంటి  మాస్ ట్యూన్స్ ఇస్తావా.. అనిరుధ్ ఎందుకు మేమంటే అంత పగ  అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట  వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రజినీ ఎలాంటి  విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×