BigTV English

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం ఘటనలో ఇద్దరు అరెస్ట్.. కుట్రా? నిర్లక్ష్యమా?

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం ఘటనలో ఇద్దరు అరెస్ట్.. కుట్రా? నిర్లక్ష్యమా?

Demolition of Prakasam barrage gates: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనలో అరెస్ట్ చేసిన ఇద్దరినీ పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు.. పడవల యజమాని ఉషాద్రితోపాటు మరో వ్యక్తి రామ్మోహన్ కు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో నిందితులను పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించారు.


Also Read: అర‌రే.. ఒక్క పోస్ట్ తో జగన్ ఇలా బుక్కయ్యాడేంటి?

కాగా, ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను 4 పడవలు ఢీకొట్టిన విషయం విధితమే. పడవలు ఢీకొట్టడంతో 67, 69, 70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. అయితే, కొట్టుకొచ్చిన బోట్ల కోసం ఇప్పటివరకు దాని యాజమానులెవ్వరూ రాలేదు. ఈ ఘటనపై విచారణ జరపాలంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read: భారీ ఆఫర్.. ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉచితంగా సర్వీస్ సేవలు.. పైగా స్పేర్ పార్టులపై 50% డిస్కౌంట్ కూడా..

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణను ప్రారంభించారు. పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఉంటే వాటిని దిగువకు వదలడంలో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పడవలపై పలు రంగులు ఉండడంతో రాజకీయ నేతల ప్రమేయం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×