BigTV English

Vidya Balan: ఆ డైరెక్టర్ రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్ షాకింగ్ కామెంట్స్

Vidya Balan: ఆ డైరెక్టర్ రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్ షాకింగ్ కామెంట్స్

Vidya Balan: క్యాస్టింగ్‌ కౌచ్.. ఇప్పటికే దీనిపై పలువురు నటీమణులు తమ గళం వినిపించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్ వంతు వచ్చింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ డైరెక్టర్ రూమ్‌కు రమ్మన్నాడు అంటూ సంచలన కామెంట్లు చేసింది విద్యా బాలన్.


ఓటీవల ఓ ఇంటర్వ్యూలో ‘‘ నేను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ యాడ్ షూట్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లాను. కాఫీ షాపులో కలుద్దామని చెప్పాను. కానీ ఆ డైరెక్టర్ ఆయన రూమ్‌కు రమ్మన్నాడు. అప్పుడు అతని ఆలోచన అర్థమైంది. రూమ్‌లోకి వెళ్లగానే లాక్ చేయకుండా.. కొంచెం తెరిచి ఉంచాను. ఆయన ఐదు నిమిషాల పాటు ఏమీ మాట్లాడకుండా ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

అయితే ఈ ఒక్క సంఘటనే కాదని.. ఆ తర్వాత ఇటువంటవి ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ఇక 2005లో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ అమ్మడు డర్టీ పిక్చర్, షేర్ని, కహాని వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Tags

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×