Big Stories

Elon Musk: ఎంపిక చేసినవాళ్ల ఉద్యోగం ఔట్.. వారి స్థానంలోకి ఎంపికైన వాళ్లు.. మస్క్‌తో మామూలుగా ఉండదు..

Elon Musk: ఎలాన్ మస్క్.. ఈయన ఏం చేసినా సెన్సేషనే.. ఆయన నిర్ణయాలన్నీ సంచలనమే. షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు మస్క్. ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక.. తన నిర్ణయాలతో ఉద్యోగులతో పాటు ప్రపంచాన్నే షాక్‌కు గురి చేస్తున్నాడు.

- Advertisement -

ఇప్పటికే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దాదాదపు 75 శాతం మంది ఉద్యోగులను ఇళ్లకు సాగనంపారు. అయితే మనేజర్ స్థాయి ఉద్యోగులకు సంబంధించి మస్క్ అనుసరించిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇటీవల ట్విట్టర్ నుంచి దాదాపు 50 మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులను తొలగించారు మస్క్.

- Advertisement -

అయితే తొలగించే ముందు.. వారికి మస్క్ ఒక టాస్క్ ఇచ్చాడట. ప్రమోషన్ల కోసం ప్రతి టీమ్ నుంచి ఒక ఎంప్లాయ్‌ను సెలక్ట్ చేయాలని సూచించాడట. ఆ తర్వాత వారిని తొలగించి.. వారు ఎంపిక చేసిన వాళ్లకు మేనేజర్ బాధ్యతలు అప్పగించారట. మేనేజర్ల జీతాలు ఎక్కువగా ఉండడంతో ఆర్థికపరమైన భారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట.

ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరలవుతోంది. కొందరు నెటిజన్లు మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News