E-Paper
Advertisement

Vijay Antony – Toofan Teaser: అత్యంత ఆసక్తికరంగా విజయ్ ఆంటోని ‘తుఫాన్’ టీజర్.. మాస్ యాక్షన్ సీన్లతో అదిరిపోయింది

Vijay Antony – Toofan Teaser: అత్యంత ఆసక్తికరంగా విజయ్ ఆంటోని ‘తుఫాన్’ టీజర్.. మాస్ యాక్షన్ సీన్లతో అదిరిపోయింది
Advertisement

Vijay Antony – Toofan Teaser: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు చేరువయ్యాడు. మరీ ముఖ్యంగా ‘బిచ్చగాడు’ సినిమాతో తనేంటో అందరికీ తెలిసేలా చేశాడు. ఈ మూవీతోనే విజయ్ తెలుగులో ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యాక్షన్, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను కంటతడిపెట్టించింది.

ఇక ఆ తర్వాత రోషగాడు, రాఘవన్, బిచ్చగాడు 2, సైతాన్ వంటి సినిమాలతో వచ్చాడు. కానీ ఈ సినిమాలేవి పెద్దగా హిట్ కాలేకపోయాయి. అయితే ఈ ఏడాది ‘లవ్ గురు’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇక ఆ మూవీ కూడా అనుకున్నంత రేంజ్‌లో హిట్ కాలేకపోయింది. దీంతో ఎలాంటి విజయపజాయాలతో సంబంధం లేకుండా ఇప్పుడు మరొక యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

Advertisement

ఇందులో భాగంగానే ‘తుఫాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని కమల్ బోరా, డి లలితా, పంకజ్ బోరా, బి ప్రదీప్ కలిసి నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ తుఫాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ మిల్టన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 1.23 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన ఈ టీజర్ ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంది.

Also Read: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Advertisement

ఈ టీజర్ ప్రకారం.. కొన్ని జీవితాలు తక్కువనే ఆలోచన ప్రపంచలోని తప్పులన్నింటికీ మూలం అనే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత టీజర్ ‌లో చూపించే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను చిన్న చూపు చూసిన సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఓ దీవీ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో విజయ్ ఆంటోనికి జోడీగా క్యూట్ అండ్ స్వీట్ బ్యూటీ మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే స్టార్ హీరో శరత్ కుమార్, డాలీ ధనంజయ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×