BigTV English

Romeo OTT Release Date: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Romeo OTT Release Date: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Romeo OTT Release Date: తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులో కూడా చాలా సినిమాలతో ఆడియన్స్‌ను అలరించాడు. ముఖ్యంగా గతంలో వచ్చిన ‘బిచ్చాగాడు’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. భారీ రెస్పాన్స్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ పేరు మారుమోగిపోయింది.


ఇందులో అతడి యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఒక ధనవంతుడిగా ఉన్న వ్యక్తి బిచ్చగాడిగా ఎందుకు మారాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కి ఆడియన్స్‌ను బాగా అలరించింది. ఇక ఈ మూవీ తర్వాత ‘బిచ్చగాడు 2’ తో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా అలరించలేకపోయింది.

ఫస్ట్ పార్ట్ నేచురల్‌గా ఉండటంతో మంచి హిట్ అయింది. కానీ సెకండ్‌ పార్ట్‌లో సైన్స్‌ను కొంచెం యాడ్ చేయడంతో ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. ఇక ఈ మూవీ తర్వాత ఇటీవలే మరొక సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వంలో ‘రోమియో’ మూవీ చేశాడు. ఈ మూవీ తెలుగులో ‘లవ్ గురు’ టైటిల్‌తో తెరకెక్కింది.


Also Read: ఈ సినిమా చూస్తే ఫ్రీగా మలేషియా, కాశ్మీర్, ఊటీ ఫ్యామిలీ ట్రిప్.. ఆఫర్ అదిరింది!

టీజర్, ట్రైలర్, సాంగ్‌లతో ఎంతగానో హైప్ పెంచుకున్న ఈ మూవీ గత నెల ఏప్రిల్ 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే అనుకున్నంత రేంజ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను పెద్దగా దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలో ఈ మూవీ ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ‘రోమియో’ తమిళ వెర్షన్ ఈ నెల అంటే మే 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలయజేస్తూ ఆహా సంస్థ ఓ వీడియోను పంచుకుంది. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ లవ్ గురూ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ హీరోగా, మృణాళిని రవి హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అలాగే గణేశ్, యోగిబాబు, ఇళవరసు, సుధ, తలైవాసల్ కీలక పాత్రల్లో నటించి అదరగొట్టారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×