BigTV English

Vijay Devara Konda : నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను .. విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్..

Vijay Devara Konda : నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను .. విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్..
Vijay Devara Konda

Vijay Devara Konda : ఈ రోజు పుట్టపర్తి భగవాన్ సత్య సాయిబాబా 98వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు భక్తులు.. సెలబ్రిటీలు స్మరించుకున్నారు .ఈనాడు ఆయన మన మధ్య సజీవంగా లేకపోయినప్పటికీ ఎప్పుడూ భక్తులను కాపాడుతూ ఉంటారు అని అందరూ గట్టిగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో సత్యసాయిబాబా భక్తుడైన విజయ్ దేవరకొండ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది.


నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను హ్యాపీ బర్త్ డే స్వామి.. అంటూ ఒక హార్ట్ ఎమోజిని జోడించి.. లవ్ ఆల్ ..సర్వ్ ఆల్ అనే బాబా ఒకసారి గుర్తు చేసుకుంటూ బాబాకి శుభాకాంక్షలు తెలిపాడు. విజయ్ దేవరకొండ ఇంతకుముందు కూడా బాబా జన్మదిన వేడుకలకు హాజరయ్యాడు. చాలామంది నీకు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి అనుకోలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్, పుట్టపర్తిలో చదువుకున్నాడు. అంతేకాదు విజయ్ దేవరకొండ యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టింది కూడా సత్య సాయి బాబా సీరియల్ లో ఒక బాలుడు క్యారెక్టర్ లో.. అందుకే అతను బాబాకి బాగా కనెక్ట్ అయినట్టు ఉన్నాడు. మొత్తానికి రౌడీ బాయిలో దైవభక్తి కూడా ఉంది అన్న విషయం ఈ పోస్టుతో అర్థమవుతుంది.


ఇక విజయ్ సంక్రాంతి బరిలోకి పక్కా ఫ్యామిలీ మెన్ గా దిగడానికి ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో ఇనుమునే వంచాలా ఏంటి డైలాగ్ బాగా పాపులర్ అయింది. విజయ్ తోపాటుగా పలువురు సెలబ్రిటీలు పుట్టపర్తి సాయిబాబాని ఆయన పుట్టినరోజు సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకున్నారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×